జగన్ కోసం, వైసీపీ కోసం ప్రజాస్వామ్యం లేదు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ ఎంపీ కుటుంబాన్ని రౌడీషీటర్లు కిడ్నాప్ చేయడానికి సిరిపురంలో ఉన్న భూముల వ్యవహారమే కారణం అని ఆయన ఆరోపించారు. వైజాగ్ ఎంపీకి సిగ్గు లేదు.. ఓట్లేసిన ప్రజలు గెలిపిస్తే వ్యాపారం చేయలేక పారిపోతాను అంటున్నాడు. ఎంపీ రాజీనామా చేయాలి.. మళ్లీ ఎన్నికలు పెట్టుకుంటాం అని పవన్ అన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్ కోర్టులు చుట్టూ తిరగాలిసిందేనని జనసేనాని విమర్శించారు.
Read Also: Viral Video: భయం లేదా భయ్యా.. అలా పట్టుకున్నావేంటి..!
చర్చి ఆస్తులు దొబ్బేసి వాస్తు దోషం అంటూ ప్రజలు తిరిగే రోడ్లు మూసేస్తారా? అని పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అధికారులు సిగ్గుపడాలి.. అయిన, సీఎం పేషీల్లోనే ఫైళ్లు మరిపోతుంటే.. జీవీఎంసీలో పైరవీలు జరగడం పెద్ద విషయం కాదు.. 18 వేల పైచిలుకు గజాల భూమిని వైసీపీ నేతలు దోపిడీ చేశారు.. అందుకోసం తప్పుడు జీవోలు సృష్టించారు.. దేవుడి భూములనే వైసీపీ నేతలు కబ్జా పెట్టేశారు అని పవన్ అన్నారు. భూముల దోపిడీ కొనసాగితే ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ అవుతుంది అని జనసేన అధినేత ఆరోపించారు.
Read Also: Yuvraj Singh: ఏంటి రోహిత్ వరల్డ్ కప్ కోసం రన్స్ దాచి పెట్టుకుంటున్నావా..?
ఏయూ విద్యార్ధులు పోరాటం చేయాలి.. యూనివర్సిటీలో పరిస్థితులు మారుస్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. దేశ రక్షణకు కీలకమైన విశాఖలో జరుగుతున్న పరిణామాలపై ప్రధాని, హోం మంత్రి దృష్టి పెట్టారని జనసేనాని అన్నారు. విశాఖపై కేంద్రం ప్రత్యేక దృష్టితో చూస్తోంది.. నా పర్యటనలో అడుగడుగునా అంక్షలు పెడుటున్నారు.. కనీసం కారులో నుంచి బయటకు వచ్చి అభివాదం చేయడానికి అంగీకరీంచడం లేదు అని పవన్ కళ్యాణ్ అన్నారు.