Shehnaaz Gill : షూటింగ్లో ప్రమాదం: పొరపాటున ముక్కు పుడక మింగేసిన నటి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినీ ప్రపంచంలో తెరవెనుక జరిగే ప్రమాదాలు ఒక్కోసారి నటీనటులకు వెన్నులో వణుకు పుట్టిస్తుంటాయి. తాజాగా ప్రముఖ నటి, గాయని షెహనాజ్ గిల్ సెట్లో ఊహించని ప్రమాదానికి గురయ్యారు. షూటింగ్ సమయంలో ఆమె అనుకోకుండా తన ముక్కు పుడకను మింగేయడం తీవ్ర కలకలం రేపింది. ప్రముఖ దర్శకుడు అరవింద్ ఖైరా తెరకెక్కిస్తున్న ‘ఇష్క్నామా’ అనే పంజాబీ పీరియడ్ లవ్ స్టోరీ షూటింగ్ సెట్లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక సన్నివేశంలో భాగంగా వేగంగా పరిగెడుతుండగా, ఆమె ముక్కుకు ఉన్న పుడక ఊడి నోట్లోకి జారిపోయింది. ఏమీ తోచని స్థితిలో ఆమె దాన్ని మింగేసి కంగారుగా తీవ్రంగా దగ్గడం మొదలుపెట్టారు. ఆ సమయంలో పక్కనే ఉన్న తోటి నటుడు సౌరభ్ సచ్‌దేవా వెంటనే స్పందించి, ఆమె వెనుక తడుతూ ప్రమాదం నుండి బయటపడేసే ప్రయత్నం చేశారు. ఈ భయానక అనుభవానికి సంబంధించిన ‘బిహైండ్ ద సీన్స్’ (BTS) వీడియోను షెహనాజ్ స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పంచుకోవడంతో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.
పంజాబీ, పాకిస్తానీ నేపథ్యాలతో కూడిన ప్రేమకథగా రూపొందుతున్న ఈ పీరియడ్ డ్రామాలో భారత పంజాబ్‌కు చెందిన నిమ్మ అనే సిక్కు కవికి, పాకిస్తాన్ పంజాబ్‌కు చెందిన నసీమా అనే ముస్లిం అమ్మాయికి మధ్య సాగే ప్రేమాయణాన్ని చూపించనున్నారు. ఇందులో షెహనాజ్ గిల్‌తో పాటు జై రంధావా, సౌరభ్ సచ్‌దేవా, అంజుమ్ బాత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో పాటు షెహనాజ్ నటించిన ‘సింగ్ వర్సెస్ కౌర్ 2’ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ప్రస్తుతం ఈ ముక్కు పుడక సంఘటన నెట్టింట బాగా ట్రెండ్ అవుతోంది.
Also Read
- Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
- BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'బెత్లహేమ్ కుటుంబ యూనిట్'
- Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
- Don’t Be Shy: హీరోయిన్గా కాదు.. నిర్మాతగా అలియా భట్.. నేరుగా ఓటీటీలోకి కొత్త సినిమా!
తాజావార్తలు
-
Pluto OTT: తాగుడుకు బానిస అయ్యే ఏలియన్.. ఓటీటీలోకి వచ్చేసిన మలయాళ సైన్స్ ఫిక్షన్ మూవీ
-
BethlehemKudumbaUnit : తెలుగులో విడుదలవుతున్న నివిన్ పౌలి లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
-
Female characters : స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ డిజైన్ చేస్తోన్న తమిళ్ ఇండస్ట్రీ
ట్రెండింగ్
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?
-
50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లే,7,050mAh బ్యాటరీతో Vivo V80 Lite 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
EPFO హెచ్చరిక.. 10 ఏళ్ల సర్వీస్ పూర్తికాకముందే PF విత్‌డ్రా చేస్తే పెన్షన్‌పై ప్రభావం..!