Ashok Gehlot: రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మను పదవి నుంచి తొలగించడానికి భారతీయ జనతాపార్టీలో కుట్ర జరుగుతోందని మాజీ సీఎం అశోక్ గెహ్లాట్ ఆరోపించారు. తన చుట్టూ ఏమి జరుగుతుందో ఆయనకి తెలియదని అన్నారు.
2017లో ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి.. పోలీసు ఎన్‌కౌంటర్ కేసులు పెరిగాయి. రాష్ట్రంలోని చాలా మంది ప్రమాదకరమైన నేరస్థులు పోలీసు ఎన్‌కౌంటర్లలో మరణించారు. పెద్ద సంఖ్యలో నేరస్థులు గాయపడ్డారు.
వక్ఫ్ సవరణ బిల్లుపై ఉత్తరప్రదేశ్ రాష్ట్రం సహారన్‌పూర్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ బిల్లు సహనం, వైవిధ్యానికి వ్యతిరేకమని ఆయన అన్నారు. ఈ బిల్లు ద్వారా అందరికీ రక్షణ కల్పించే రాజ్యాంగాన్ని బలహీనపరుస్తున్నారు. వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తూనే, ఇమ్రాన్ మసూద్ తాజాగా ఏర్పడబోయే బోర్డు గురించి ప్రస్తావించారు. వక్ఫ్ బోర్డులో 22 మంది సభ్యులు ఉంటారని, వారిలో 10 మంది మాత్రమే ముస్లింలు ఉంటారన్నారు. ఈ విధంగా.. వక్ఫ్ బోర్డులో ముస్లిమేతర…
Former CM Atishi: దేశ రాజధాని ఢిల్లీలో కొత్తగా ఏర్పడిన బీజేపీ ప్రభుత్వంపై ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు, మాజీ ముఖ్యమంత్రి అతిషి తీవ్ర విమర్శలు గుప్పించారు. కమలం సర్కార్ వచ్చిన వెంటనే హస్తినాలో విద్యుత్ కోతలు ప్రారంభమయ్యాయని అన్నారు.
V.Hanumantha Rao : సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ వీ. హనుమంతరావు (వి.హెచ్) కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అధికార దుర్వినియోగంతో పాటు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగా ప్రతిపక్ష నేతలపై కేసులు బనాయిస్తూ, అధికార పార్టీకి చెందిన నేతలపై చేసిన ఫిర్యాదులను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. వీహెచ్ మాట్లాడుతూ, 2022 డిసెంబర్ 16న రాహుల్ గాంధీపై దేశ రక్షణకు సంబంధించిన అనుచిత వ్యాఖ్యల కేసు నమోదు చేసి, మార్చి 24న…
ఎమర్జెన్సీ సమయంలో జైలుకు వెళ్లిన వారికి ప్రతినెలా రూ.20వేలు, వైద్య సదుపాయాలు కల్పిస్తామని ఒడిశా బీజేపీ ప్రభుత్వం పెద్ద ప్రకటన చేసింది. ఈ మేరకు రాష్ట్ర హోంశాఖ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేతిలో చిత్రహింసలకు గురైన ఒడిశా ప్రజలకు ప్రభుత్వం వైద్య ఖర్చులతో పాటు పింఛను అందజేస్తుందని ప్రభుత్వం తెలిపింది.
కాంగ్రెస్.. రాహూల్ గాంధీ ఇచ్చిన హామీ ప్రకారం సీఎం రుణమాఫీ చేశారని.. ఆర్థికంగా ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉన్నా... 31 వేల కోట్ల రూపాయలు రుణమాఫీకి తీర్మానం చేసి... 18 వేల కోట్లు బ్యాంకుల ఖాతాలో వేశారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు.
మరికొద్ది నెలల్లో హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతోంది. ఎన్నికలకు ముందు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం అగ్నివీర్ పథకానికి సంబంధించి పెద్ద ప్రకటన చేసింది.
ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ మాఝీ బాధ్యతలు చేపట్టనున్నారు. దీంతో పాటు కొత్త ఒడిశా ప్రభుత్వంలో ఇద్దరు ఉప ముఖ్యమంత్రులు కూడా ఉంటారు. వీరిలో ఒకరు బీజేపీ సీనియర్ నేత కేవీ సింగ్ డియో కాగా, మరొకరు తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన ప్రవతి పరిదా.
Odisha : ఒడిశాలో తొలిసారిగా భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం ఏర్పాటు కానుంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో 147 మంది సభ్యులున్న అసెంబ్లీలో 78 సీట్లు గెలుచుకుని బీజేపీ మెజారిటీ సాధించింది.