Manchu Manoj: సినిమాకు కులం, గోత్రం ఉండదు.. మంచు మనోజ్ సంచలన కామెంట్స్ వైరల్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Manoj: ‘గజ’ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో హీరో మంచు మనోజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సినిమా టీజర్‌పై ప్రశంసలు కురిపించారు. దర్శకుడిగా, హీరోగా, నిర్మాతగా ఒకేసారి బాధ్యతలు తీసుకోవడం అంత సులభమైన విషయం కాదన్నారు. కొత్త టీమ్‌తో ఇలాంటి ప్రయత్నం చేయడానికి ధైర్యం చేసిన చిత్రబృందాన్ని అభినందించారు. ‘గజ’ టీజర్ చాలా బాగా వచ్చిందని, తాను నిజంగా ఇంప్రెస్ అయ్యానని మనోజ్ తెలిపారు. జీవితంలో ముందుకు వెళ్లాలంటే రిస్క్ తీసుకోవడంతో పాటు, దానిపై నమ్మకంతో కష్టపడాలని అన్నారు. ఈ సినిమా కోసం సతీష్ జై దర్శకుడు, హీరో, నిర్మాతగా పనిచేసిన తీరు తనను ఆకట్టుకుందని పేర్కొన్నారు.
అలాగే ఈ చిత్ర సంగీత దర్శకుడు మణిశర్మతో తనకున్న అనుబంధాన్ని కూడా మనోజ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రి మోహన్‌బాబు నటించిన ‘రాయలసీమ రామన్న చౌదరి’ సినిమాకు తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన సమయంలో ఆయన సంగీతాన్ని దగ్గరుండి చూశానని చెప్పారు. ఇటీవల ఆయన అందించిన ‘చెన్నై లవ్ స్టోరీ’ కూడా మంచి విజయాన్ని అందుకుందని, ‘గజ’తోనూ ఆ విజయ పరంపర కొనసాగాలని ఆకాంక్షించారు. సినిమా పరిశ్రమకు కులం, గోత్రం ఉండవని మంచు మనోజ్ అన్నారు. “కళామతల్లికి కులం లేదు.. మతం లేదు. సినిమా వాళ్లకు, ప్రేక్షకులకు, మీడియాకు మనందరిదీ ఒకటే కులం.. ప్రేమ కులం” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా చిన్నదా, పెద్దదా అనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు ఆదరిస్తారని తెలిపారు. ‘గజ’ టీజర్ చూస్తుంటే సినిమా చాలా ప్రామిసింగ్‌గా అనిపించిందని, చిత్రబృందం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్పారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు.
Also Read
- Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
- Dada: బాలయ్య ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్... హైదరాబాద్‌లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్‌డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
తాజావార్తలు
-
Anupama: హైదరాబాద్‌లో ఇల్లు కట్టుకుంటున్న అనుపమ
-
TG SAFE: హైదరాబాద్‌లో అక్రమ డైరీ దందా గుట్టురట్టు.. వెలుగులోకి షాకింగ్ విషయాలు..
-
Vaibhav Sooryavanshi: పాపం వైభవ్ సూర్యవంశీ.. తొక్కేస్తున్న గౌతమ్ గంభీర్.. ఇదే సాక్ష్యం!
-
CNAP Service: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నవంబర్ 1 నుంచి ఫోన్లలో కాలర్ పేరు ప్రత్యక్షం!
-
Eluru Mayor Seat: టీడీపీ, జనసేన మధ్య టఫ్ వార్.. ఏలూరు మేయర్ సీటుపై సస్పెన్స్!
ట్రెండింగ్
-
IND vs WI 4th T20: అందరూ కాటేరమ్మకొడుకులే.. కానీ ఉప్పల్‌లో తుస్సుమన్నారు.. భారత్ ఓటమికి ఐదు కారణాలు ఇవే!
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!