Palamuru Rangareddy Project: పాలమూరుకు కేంద్రం షాక్.. జాతీయ హోదాపై క్లారిటీ.!
- జాతీయ ప్రాజెక్టు హోదాపై కేంద్రం కీలక ప్రకటన
- డీపీఆర్ వెనక్కి.. సాంకేతిక పరిశీలనకు బ్రేక్
- కృష్ణా జల వివాదమే ప్రధాన అడ్డంకి
- కేంద్ర నిధులపై ఇంకా తుది నిర్ణయం లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Palamuru Rangareddy Project: తెలంగాణ రాష్ట్రానికి అత్యంత ప్రతిష్టాత్మకమైన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి (PRLIS) జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించే ప్రతిపాదన ప్రస్తుతం తమ పరిశీలనలో లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ రేణుక చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రం లిఖితపూర్వకంగా సమాధానమిస్తూ ఈ విషయాన్ని వెల్లడించింది.
డీపీఆర్ వెనక్కి.. సాంకేతిక అనుమతుల నిలిపివేత
కృష్ణా నదీ జలాల వినియోగం , అంతర్రాష్ట్ర వివాదాలు ప్రస్తుతం కృష్ణా జల వివాదాల ట్రైబ్యునల్-II (KWDT-II) పరిధిలో ఉన్నందున, ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో-ఎకనామిక్ అప్రైజల్ను ప్రస్తుతం చేపట్టలేమని కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో తిరిగి రావాలంటూ డీటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR)ను కేంద్రం వెనక్కి పంపింది. అంతేకాకుండా, ప్రాజెక్టుకు కేంద్ర నిధుల సాయం అందించే విషయంలోనూ ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని వెల్లడించింది.
Also Read
మార్గదర్శకాల ప్రకారమే హోదా కేటాయింపు
జాతీయ ప్రాజెక్టు హోదా అనేది ప్రధానంగా జాతీయ ప్రాధాన్యం, అంతర్రాష్ట్ర లేదా అంతర్జాతీయ జల వివాదాలు లేకపోవడం , గణనీయమైన సాగునీటి సామర్థ్యం ఆధారంగా నిర్దేశిత మార్గదర్శకాల ప్రకారమే ఇస్తామని కేంద్రం పునరుద్ఘాటించింది. కృష్ణా జలాలపై క్లియరెన్సులు, ట్రిబ్యునల్ పరిధిలోని అంశాలు తేలితే తప్ప ఈ ప్రాజెక్టు హోదాపై తదుపరి నిర్ణయం తీసుకోవడం సాధ్యం కాదని కేంద్రం తేల్చిచెప్పింది.
తాజావార్తలు
-
Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
-
PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
-
Anand Deverakonda : వాళ్ళ సపోర్ట్ లేకుండా ఉంటే ఏమీ చేయలేక పోయేవాడిని!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్‌కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!