విశాఖ స్టీల్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు NAFC యూనిట్ లో మంటలు చెలరేగాయి. దీంతో దట్టమైన పొగ కమ్మేసింది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా.. అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. కాగా.. ఈ ఘటనలో ప్రాణనష్టమేమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో ఆస్తి నష్టం భారీగా జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. మరోవైపు.. ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
kishan reddy: విశాఖ స్టీల్ ఫ్లాంట్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్ఎస్ ప్రభుత్వానికి లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ కొంటామని సింగరేణి ఆధికారులను ఆఘమేఘాల మీద అక్కడికి పంపించి రాజకీయ డ్రామాకు తెరతీశారన్నారు.
విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కీలక సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చైర్మన్ సీహెచ్ నరసింగరావు మీడియాతో మాట్లాడారు.. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ఒక్క రోజు కూడా విరామం ఇవ్వకుండా నిరసన దీక్ష చేసిన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. దీంతో భవిష్యత్ కార్యచరణపై ఉక్కు పరిరక్షణ పోరాట సమితి దృష్టి పెట్టింది. కరోనా పరిస్థితుల్లో కూడా స్టీల్ ప్లాంట్‌కు రూ.700 కోట్ల లాభాలు వచ్చాయని తెలిపారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో భాగంగా ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ మరో అడుగు ముందుకు వేసింది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఉద్యోగులు ఆందోళన బాట పట్టిన సంగతి తెల్సిందే.. ఈ ఉద్యమానికి రాజకీయ పార్టీలు సైతం మద్దతునిస్తున్నాయి. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పలు మార్లు ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.…
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం జనసేన పార్టీ డిజిటల్ ఉద్యమం చేపట్టింది. ఈ మేరకు ఈనెల 18 నుంచి 20 వరకు మూడు రోజుల పాటు జనసేన డిజిటల్ క్యాంపెయిన్ చేయనుంది. విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్లమెంట్‌లో పోరాడాలని వైసీపీ, టీడీపీ ఎంపీలను ట్విట్టర్‌లో ట్యాగ్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఈ విషయంపై మన ఎంపీలకు బాధ్యత గుర్తు చేయాలని పవన్ ఆకాంక్షించారు. స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు పార్లమెంట్‌లో ఎంపీలు…