విజయవాడ హిజాబ్ వివాదంపై లయోలా కళాశాల యాజమాన్యం స్పందించింది. లయోలా కాలేజ్ ప్రిన్సిపాల్ కిషోర్ మాట్లాడుతూ.. ఇవాళ తరగతిగదిలో ఇద్దరు హిజాబ్ ధరించి వచ్చారు. నేను తరగతి గదులకు రౌండ్ కు వెళ్ళినప్పుడు ఇది గమనించాను. కళాశాలకు హిజాబ్ ధరించి వస్తున్నారేంటని ప్రశించాను. తరగతి గదిలో విద్యార్థులు అందరూ యూనిఫామ్ తోనే ఉంటారు. ఇద్దరు విద్యార్థులను పిలిచి మాట్లాడాను..వారి తల్లిదండ్రులు నా దగ్గరకు వచ్చారు. కళాశాలలో చేరేటప్పుడు ఇక్కడి నిబంధనలు పాటిస్తామని సంతకం చేస్తారు. కలెక్టర్ ఆదేశాలతో…