Srisailam Temple Ghee Controversy: శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా..? కొత్త అనుమానాలు
- శ్రీశైలానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా చేశారా అనే అనుమానం..
- 2022 మే నుండి 2023 మార్చి వరకు నెయ్యి సప్లై చేసిన రాజేష్ కార్పొరేషన్ కాంట్రాక్టర్..
- గతంలో శ్రీశైలం ఆలయానికి విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా..
- విజయ డైరీని కాదని రాజేష్ కార్పొరేషన్ నుంచి నెయ్యి సరఫరాతో చర్చ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Srisailam Temple Ghee Controversy: ఇప్పటికే తిరుమల శ్రీవారి ఆలయంలో కల్తీ నెయ్యి వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వేళ, ఇప్పుడు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆలయానికి కూడా కల్తీ నెయ్యి సరఫరా జరిగిందా? అనే అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశం భక్తుల్లో తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. సాధారణంగా శ్రీశైలం ఆలయానికి గతంలో విజయ డైరీ నుంచి నెయ్యి సరఫరా జరిగేది. అయితే 2022 మే నెల నుంచి అకస్మాత్తుగా విజయ డైరీని పక్కనపెట్టి, రాజేష్ కార్పొరేషన్ అనే సంస్థ నుంచి నెయ్యి సరఫరాకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Read Also: sreeleela : ప్రతి జన్మలోనూ నువ్వే నా అమ్మగా పుట్టాలి.. శ్రీలీల ఎమోషనల్ పోస్ట్!
Also Read
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- CM Chandrababu: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ.. భువివాదాలు లేకుండా చేస్తాం..
ప్రత్యేకంగా, రాజేష్ కార్పొరేషన్‌కు సొంత డైరీ లేకపోవడం, ఇతర సంస్థల నుంచి నెయ్యిని కొనుగోలు చేసి ఆలయానికి సరఫరా చేసినట్టు వస్తున్న ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. రాజేష్ కార్పొరేషన్ సంస్థ బోలే బాబా డైరీ నెయ్యినే కొనుగోలు చేసి, అదే నెయ్యిని శ్రీశైలం దేవస్థానానికి సరఫరా చేసి ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో, తిరుమల నెయ్యి వివాదంలో బోలే బాబా డైరీ పేరు వినిపించడంతో ఈ అంశం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది.
అధికారుల సమాచారం ప్రకారం, 2022 మే నుంచి 2023 మార్చి వరకు మొత్తం 11 నెలల కాలంలో రాజేష్ కార్పొరేషన్ సంస్థ శ్రీశైలానికి 3,25,064 కిలోల నెయ్యి సరఫరా చేసింది. ఈ పరిమాణం పెద్దదిగా ఉండటంతో, నెయ్యి నాణ్యతపై మరింత లోతైన విచారణ అవసరమనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. అయితే, శ్రీశైలం ఆలయంలో కల్తీ నెయ్యి వాడినట్టు ఇప్పటివరకు ఎలాంటి ధ్రువీకరణ లేదని దేవస్థాన అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రయోగశాల పరీక్షల్లో గానీ, అధికారిక విచారణలో గానీ ఇప్పటివరకు నెయ్యి కల్తీకి సంబంధించిన స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపారు. అలాగే, రాజేష్ కార్పొరేషన్ సంస్థ కల్తీ నెయ్యి సరఫరా చేసిందని ఎక్కడా నిర్ధారణ కాలేదని అధికారులు చెబుతున్నారు. విజయ డైరీ లాంటి ప్రభుత్వ అనుబంధ సంస్థను కాదని, సొంత డైరీ లేని రాజేష్ కార్పొరేషన్‌కు నెయ్యి సరఫరా కాంట్రాక్టు ఎలా దక్కిందన్న అంశంపై ఇప్పుడు పలు వర్గాలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.
తాజావార్తలు
-
Ragi Semiya Payasam: రాగితో కమ్మని పాయసం.. ఐరన్, కాల్షియం, ఫైబర్ పుష్కలం.. రెసిపీ ఇదిగో!
-
Adnan Sami: మూడు పెళ్ళిళ్ళు విఫలమైనా.. పాకిస్తాన్ జనరల్స్ నాపాటకి స్టెప్పులేస్తారు.. అద్నాన్ సమి జీవితంలో ఈ మలుపులేంటి?
-
Trivikram: త్రివిక్రమ్‌తో మా బంధం అలాంటిది.. ఎలాంటి అగ్రిమెంట్లు లేవు: నాగవంశీ
-
Avika Gor: 104 డిగ్రీల జ్వరంతోనూ షూటింగ్.. ఆసుపత్రి పాలైన అవికా గోర్..
-
Renu Dhariyal: అయ్ బాబోయ్ ఎంతపొడుగో.. జుట్టు పెంచుకుంటూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కొట్టేసిన మహిళ..
ట్రెండింగ్
-
19.62kmpl మైలేజ్, 150hp టర్బో ఇంజిన్‌తో Volkswagen Virtus Anniversary ఎడిషన్ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Clothes Smell: వర్షాకాలంలో బట్టల నుంచి దుర్వాసనా.? ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి ఇలా.!
-
1TB వరకు స్టోరేజ్,120Hz డిస్ప్లే, Tensor G6తో Google Pixel 11 సిరీస్.. లాంచ్‌కు ముందే ధరలు లీక్.!
-
Airtel యూజర్లకు షాక్.. రూ.299 ప్లాన్ నిలిపివేత.. ఇక అన్లిమిటెడ్ ప్లాన్ రూ.349 నుంచే మొదలు.!
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!