Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bhuma Akhila Priya: టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ కీలక వ్యాఖ్యలు చేశారు. తన భర్త భార్గవ్ నాయుడు నియోజకవర్గ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని పార్టీ సూచించిందన్న ప్రచారంపై స్పందిస్తూ, అలాంటి నిర్ణయం ఉంటే ముందుగా తనకే తెలియజేస్తారని స్పష్టం చేశారు. పార్టీ కార్యాలయానికి రావడాన్ని అనవసరంగా వివాదాస్పదం చేస్తున్నారని అన్నారు. బోండా ఉమాను పిలిచిన తర్వాత తనను పిలవడంతోనే అనవసర ప్రచారం జరుగుతోందని అఖిలప్రియ పేర్కొన్నారు. తాను వైఎస్సార్సీపీ నాయకులతో వేదిక పంచుకోలేదని, ఎలాంటి కాంట్రాక్టర్లను బెదిరించలేదని స్పష్టం చేశారు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, ప్రత్యేకంగా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
పార్టీ సమావేశంలో జిల్లా సమస్యలు, కార్యకర్తల అంశాలు, సభ్యత్వ కార్యక్రమం, వ్యక్తిగత విషయాలపైనే చర్చ జరిగిందని తెలిపారు. పార్టీ పిలిచిందంటే ఏదో తప్పు జరిగిందని భావించడం సరికాదన్నారు అఖిలప్రియ.. అహోబిలంలో జరుగుతున్న పరిణామాలపై మీడియా, ప్రజలు దృష్టి సారించాలని అఖిలప్రియ కోరారు. మూడు రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో ఓ మైనర్ బాలికపై దాడి యత్నం జరిగిన ఘటనను ప్రస్తావిస్తూ, ఆ విషయం మీడియాలో పెద్దగా ప్రాధాన్యం పొందలేదని అన్నారు. అహోబిలం మఠం పరిధిలో ఉన్నందున అది దేవాదాయ శాఖ పరిధిలోకి రాదని, ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకునే అవకాశం లేదని వివరించారు.
Also Read
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
- AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
- CM Chandrababu: ఈసీ వివరణపై స్పందించిన సీఎం చంద్రబాబు.. కీలక వ్యాఖ్యలు..
- CRDA: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్..! గ్రామకంఠం మినహాయింపులపై CRDA క్లారిటీ..
అహోబిలంలో జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను ప్రజల ముందుకు తీసుకురావాలని భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. ఆళ్లగడ్డలో ఏం జరుగుతుందో స్థానిక ప్రజలను అడిగితే నిజాలు తెలుస్తాయని, తాను చెబితే రాజకీయ రంగు పులుముతారని వ్యాఖ్యానించారు టీడీపీ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ..
తాజావార్తలు
-
Allu Arjun : నెవ్వర్ బిఫోర్ అవతార్స్‌లో అల్లు అర్జున్
-
Chairman’s Desk : తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటి? భారీ సినిమాలు వరుసగా అట్టర్ ఫ్లాప్స్!
-
WPL 2027: సంచలన నిర్ణయం తీసుకున్న ఆర్సీబీ.. విధ్వంసకర బ్యాట్స్‌మెన్ రిలీజ్..
-
OTR : El Ninoతో మరణమృదంగమేనా ? లక్షల మంది పిట్టల్లా రాలిపోతారా ?
-
OTR : పుంగనూరు స్థానిక సమరం రణరంగంగా మారుతుందా.?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!