Nandyal: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పేరాయిపల్లి మిట్ట సమీపంలో NH 40పై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా 15 మందికి పైగా గాయపడ్డారు. హైదరాబాద్ నుంచి పాండిచ్చేరి వెళ్తున్న మైత్రి ట్రావెల్స్ బస్సు రోడ్డుపై నిలిపి ఉండగా వెనుక నుంచి వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ముందు నిల్చున్న మరో లారీని బస్సు ఢికొట్టింది. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు ప్రయాణికులు మృతి చెందారు. గాయపడ్డవారిని ఆళ్లగడ్డ, నంద్యాల…