NIA: నంద్యాలలో ఎన్ఐఏ విచారణ.. కేరళ ఎన్కౌంటర్ తర్వాత మరో ట్విస్ట్.. మవోయిస్టు జయమ్మ జీవించి ఉందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: నంద్యాల జిల్లాలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారుల విచారణ కలకలం రేపుతోంది. గడివేముల మండలం పరమటూరు గ్రామానికి చెందిన మావోయిస్టు నేత నామాల జయమ్మ అలియాస్ అరుణకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరించారు. జయమ్మ తల్లిదండ్రులు, బంధువులను విచారించడంతో పాటు గ్రామ వీఆర్వో నుంచి కూడా కీలక సమాచారం సేకరించారు. దాదాపు 25 ఏళ్ల క్రితం నల్లమల అటవీ ప్రాంతంలో నక్సల్స్ కార్యకలాపాలు ఉధృతంగా సాగిన సమయంలో, వివాహం అనంతరం నామాల జయమ్మ తన భర్త భాస్కర్‌తో కలిసి మావోయిస్టు ఉద్యమంలో చేరి అడవిబాట పట్టినట్లు సమాచారం. అనంతరం భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భాస్కర్ పోలీసులకు లొంగిపోగా, జయమ్మ మాత్రం ఉద్యమాన్ని కొనసాగించినట్లు తెలుస్తోంది.
2005లో నల్లమల ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలు బలహీనపడటంతో జయమ్మ ఆంధ్ర–ఒడిశా సరిహద్దు (ఏఓబీ) ప్రాంతానికి వెళ్లినట్లు సమాచారం. రెండేళ్ల క్రితం కేరళ అడవుల్లో జరిగిన ఓ ఎన్కౌంటర్లో జయమ్మ మృతిచెందినట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. అయితే, తాజాగా ఎన్ఐఏ అధికారులు నంద్యాల జిల్లాలో విచారణ చేపట్టి కుటుంబ సభ్యులు, స్థానిక అధికారుల నుంచి వివరాలు సేకరించడంతో జయమ్మ మృతిపై మరోసారి చర్చ మొదలైంది. మృతి చెందినట్లు ప్రచారం జరిగిన తర్వాత కూడా ఎన్ఐఏ విచారణ కొనసాగుతుండటంతో, జయమ్మ నిజంగా మృతిచెందిందా? లేక ఇంకా జీవించి ఉందా? అనే సందేహాలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై ఎన్ఐఏ అధికారులు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Also Read
- Srisailam Tragedy: శ్రీశైలంలో విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్య
- Srisailam Ghat Road Traffic Jam: వరుస సెలవుల ఎఫెక్ట్.. శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్.. కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు
- Srisailam Water Release: గుడ్‌న్యూస్.. శ్రీశైలం నుంచి నీటి విడుదల ప్రారంభం
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
తాజావార్తలు
-
Mahesh Kumar Goud : బీఆర్ఎస్ అప్పులపై మహేష్ గౌడ్ సవాల్.. ‘చర్చకు వస్తారా?’
-
Abhijeet Dipke Controversy: రామ మందిర CEOపై తప్పుడు వీడియో.. అభిజీత్ దీప్కేపై విమర్శలు..
-
Vaibhav Sooryavanshi: చిన్న వయసులోనే ఊహించని పాపులారిటీ.. వైభవ్ వైభవ్ అంటూ మాస్ మేనియా..
-
India Diesel Exports: రష్యా, అమెరికాను వెనక్కి నెట్టి.. యూరప్ డీజిల్ సరఫరాలో భారత్ టాప్
-
Nepal Earthquake: ఓ వైపు వరద విలయం.. నేపాల్‌లో భూకంపం..
ట్రెండింగ్
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!