విశాఖ జిల్లా మధురవాడలో వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది సృజన. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు పోలీసులు. పరవాడకు చెందిన మోహన్‌తో ఏడేళ్లుగా సృజన ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కోరాడు మోహన్. అయితే, పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసింది సృజన. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకే సృజన విపపదార్థం తిన్నట్లు గుర్తించారు పోలీసులు. ఆరోగ్యం క్షీణించి ఈనెల 11న పెళ్లి పీటలపై నవ వధువు కుప్పకూలింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా, పెళ్లిపీటలపై సృజన మృతిచెందిన ఘటన కలకలం సృష్టించిన విషయం తెలిసిందే.. ఆ ఘటనపై అనేక కథనాలు వచ్చాయి.. చివరకు.. సంచలన విషయాలు పోలీసుల విచారణలో వెలుగుచూశాయి.
Read Also: Chandrababu: హత్యకు గురైన ఎమ్మెల్సీ డ్రైవర్ ఫ్యామిలీకి టీడీపీ ఆర్థికసాయం..