విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది... సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..
విశాఖ జిల్లా మధురవాడలో వధువు సృజన మృతి కేసు మిస్టరీ వీడింది. పెళ్లి ఆపాలనుకునే ప్రయత్నంలో ప్రాణాలు పోగొట్టుకుంది సృజన. ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తేల్చారు పోలీసులు. పరవాడకు చెందిన మోహన్‌తో ఏడేళ్లుగా సృజన ప్రేమ వ్యవహారం నడుస్తోంది. సరైన ఉద్యోగం లేకపోవడంతో పెళ్లికి సమయం కోరాడు మోహన్. అయితే, పెళ్లికి మూడు రోజుల ముందు ప్రియుడితో ఇన్‌స్టాలో చాటింగ్ చేసింది సృజన. పెళ్లి ఆపేందుకు ప్రయత్నిస్తానని ప్రియుడికి చెప్పింది. పెళ్లి ఆపేందుకే సృజన విపపదార్థం…