ఈనెల 11, 12 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో ప్రధానమంత్రి సభ ఏర్పాట్లను పరిశీలించారు ఎంపీ విజయసాయిరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి,మంత్రి అమర్నాథ్. విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ .. ప్రధాని పర్యటనకు సంబంధించి దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి..3 లక్షల మంది ప్రజలు సభకు వస్తున్నారు..అనకాపల్లి విశాఖ జిల్లా నుంచి 2 లక్షలు, మిగతా నాలుగు జిల్లాలని లక్ష మంది ప్రజలు హాజరవుతారు.. వచ్చిన ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం అన్నారు.
Read ALso: CM Jagan Vizag Tour: విశాఖ టూర్…. సీఎం జగన్ షెడ్యూల్ ఇదే!
ప్రధానమంత్రి కి సీఎం జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ స్వాగతం పలుకుతారు..15,000 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేస్తారు..ఇది రాజకీయ సభ కాదు అభివృద్ధికి సంబంధించిన సభ..నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడ చెట్లు తొలగించలేదు..ప్రధాని సభకు అడ్డువచ్చిన కొన్ని చెట్లను మాత్రమే తొలగించారన్నారు. మళ్లీ అదే స్థాయిలో మొక్కలను నాటుతారు..30 ఎకరాల స్థలంలో మీటింగ్ జరుగుతుందన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి.
Read Also: Keanu Reeves: ‘జాన్ విక్’ పైనే కీనూ రీవ్స్ ఆశలు!
ఇదిలా వుంటే… ప్రధాని మోడీ పర్యటనకు అటు వైసీపీ, ఇటు బీజేపీ కూడా ఏర్పాట్లు చేసింది. వైసీపీ ప్రధానికి స్వాగతం పలుకుతోంది. ఇటు బీజేపీ నేతలు కూడా భారీ స్థాయిలో కాషాయరంగు తోరణాలో స్వాగత తోరణాలు ఏర్పాటుచేశారు. బీజేపీ కీలక నేతలు ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఏపీ ప్రభుత్వ పరంగా మోడీ పర్యటనలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించనున్నారు. విజయసాయికే జగన్ బాధ్యతలు అప్పగించారని తాడేపల్లిలో ప్రచారం సాగుతోంది. రెండురోజుల పర్యటనలో జగన్ మోడీని ఏం అడుగుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.