ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 11, 12వ తేదీల్లో విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతో కలిసి పలు అభివృద్ది, శంకుస్ధాపన కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారు. ఇటు సీఎం జగన్, అటు ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.
Read Also: Thummala Nageswara Rao: పార్టీ జంప్‌పై క్లారిటీ.. యుద్ధమే చేస్తున్నామంటూ తేల్చేశారు
11వ తేదీ జగన్ షెడ్యూల్
* శుక్రవారం సాయంత్రం 5.05 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారు సీఎం జగన్
* 6.15 గంటలకు జగన్ విశాఖ చేరుకుంటారు. 6.35 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి స్వాగతం పలుకుతారు.
* అనంతరం రాత్రికి పోర్ట్ గెస్ట్‌హౌస్‌లో సీఎం జగన్మోహన్ రెడ్డి బసచేస్తారు.
12వ తేదీ జగన్ షెడ్యూల్
* ఉదయం 10.05 గంటలకు ఏయూ గ్రౌండ్‌లోని హెలీప్యాడ్ వద్దకు చేరుకోనున్న సీఎం జగన్
* ఉదయం 10.20 గంటలకు ప్రధాని నరేంద్రమోదీకి స్వాగతం
* ఉదయం 10.30 – 11.45 గంటల వరకు ప్రధానితో కలిసి పలు శంకుస్ధాపనలు, ప్రాజెక్ట్‌ల ప్రారంభోత్సవాలు
* మధ్యాహ్నం 12.20 గంటలకు ఐఎన్‌ఎస్ డేగాకు చేరుకుని ప్రధానికి వీడ్కోలు
* 12.45 గంటలకు విశాఖ విమానాశ్రయం నుంచి గన్నవరం బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న జగన్
Read Also: Tirupati Police: తిరుపతి హైవేపై రూ.35 లక్షల దోపిడీ కేసు..ఎలా పట్టుకున్నారంటే?