Vizag Minor Girl Case: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minor Girl Physically Harassed By 5 Members In Vizag: కామాంధులు రానురాను మరింతగా రెచ్చిపోతున్నారు. చిన్నా, పెద్దా అని తేడా లేకుండా.. మైనర్ బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. ఒంటరిగా కనిపిస్తే చాలు.. రాక్షసుల్లాగా ఎగబడుతున్నారు. తాజాగా విశాఖపట్నంలోనూ ఓ దారుణ సంఘటన చోటు చేసుకుంది. ఓ మైనర్ బాలికపై ఐదుగురు దుర్మార్గులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. పదిరోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారు. ఎట్టకేలకు బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదుతో.. పోలీసులు నిందితుల్ని పట్టుకున్నారు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
Also Read
- CM Chandrababu: నియోజకవర్గాల స్థాయిలో విజన్ ప్లాన్లు.. అధికారులకు సీఎం దిశానిర్దేశం
- AP Cabinet Meeting: నేడు ఏపీ కేబినెట్ అత్యవసర భేటీ.. స్థానిక ఎన్నికలపై ఫోకస్, బీసీ రిజర్వేషన్లపై కీలక నిర్ణయం..
- AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
- CM Chandrababu: లక్ష్యాలు చేరకపోతే కలెక్టర్లు, మంత్రులదే బాధ్యత.. సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్
పాఠశాలలో ప్యూన్‌గా పని చేసే ఓ వ్యక్తి.. తన నలుగురు స్నేహితులతో కలిసి విశాఖ 104 ఏరియా సమీపంలో.. పదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఒకటి కాదు, రెండు కాదు.. పది రోజుల నుంచి ఆ బాలికని చిత్రహింసలకు గురి చేస్తున్నారు. శారీరకంగా దాడి చేశారు. వేధింపుల సమయంలో.. మొబైల్ ఫోన్‌లో నగ్న ఫోటోలు తీయడంతో పాటు వీడియోలు రికార్డ్ చేశారు. ఆ వీడియోల్ని చూపిస్తూ.. ఆ బాలికని పలుమార్లు వేధించారు. ఆ ఐదుగురు నిందితులు ఆ మైనర్ బాలికపై గ్యాంప్‌రేప్ చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమ కుమార్తెలో వచ్చిన మార్పులు, శరీరంపైనున్న గాయాలు చూసి షాక్‌కి గురైన తల్లిదండ్రులు.. ఆమెని అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాలిక చెప్పిన సమాచారంతో వారు కుంగిపోయారు.
Bandla Ganesh: సిగ్గు లేదా.. మీకు జీవితంలో బుద్ధి రాదు.. మీ బతుకులు చెడ
దీంతో.. మైనర్ బాలిక తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత పది రోజుల నుంచి ఐదుగురు నిందితులు తమ కుమార్తెని లైంగికంగా వేధిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసుని సీరియస్‌గా తీసుకున్న ఎయిర్‌పోర్ట్ పోలసులు వెంటనే రంగంలోకి దిగి, ఆ ఐదుగురిని అరెస్ట్ చేశారు. వారిపో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దిశా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.
తాజావార్తలు
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
CJP Protest: ఢిల్లీలో ఉత్కంఠ.. అభిజీత్ దీప్కే, సౌరవ్ దాస్, రాంకా, ధ్రువ్ రాఠీ అరెస్ట్..
-
Kuttu Roti Recipe: నవరాత్రి ఉపవాసం కోసం కుట్టు రొట్టెలు.. పొంగేలా తయారు చేసే సులభమైన పద్ధతి
-
Fauzi vs Spirit: ఫౌజీ రిలీజ్ డేట్ చెప్పేస్తారా?.. ‘స్పిరిట్’ రాక ఆలస్యం కానుందా?
-
Delhi CJP Protest: ఢిల్లీలో నిరసన ఎఫెక్ట్.. 170కి పైగా రైళ్లు క్యాన్సిల్.. ముప్పు తిప్పలు పడుతున్న ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!