ఏపీలో గత రెండున్నరేళ్లలో అభివృద్ది అనేది కనిపించటం లేదు. అప్పులేనిదే పూట గడవని పరిస్తితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది అని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. అప్పుతెచ్చుకోవడం, అరువు తెచ్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పీహెచ్‌డీ చేసింది. అప్పుల నుడి బయటపడేందుకు ఏదైనా ఆలోచిస్తుంది అంటే అదేమి లేదు…ప్రజలపై భారం మాత్రమే వేస్తుంది. కేంద్ర ప్రభుత్వ పతకాలను నీరు కర్చే విధంగా ఏవేవో అదేసాలిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. కేంద్రం చెపట్టేవి తప్ప రాష్ట్ర ప్రభుత్వం రూపాయి ఖర్చు పెట్టింది లేదు. విజయవాడ – బెంగులూరు హై వే నిర్మాణాన్ని కేంద్రం చేపడుతోంది. నడికుడి శ్రీకాళహస్తి కొత్త లైన్ ప్రారంభమైంది…ఇంకా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితిలో రాష్ట్రం మేము డబ్బులు ఇవ్వలేము మీరే చేపట్టండి అంటోంది. 8లక్షల 16 వేల కోట్ల రూపాయిలతో ఏపీ లో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది అన్నారు.
అభివృద్ది విషయములో రాష్ట్ర ప్రభుత్వం తమ వాటా డబ్బులు ఇవ్వాలి. అలా కాకుండా ఓటింగ్ కే పరిమితమైతే అదే మిగులుతుంది. రివర్స్ టెండరింగ్ అని మొదలు పెట్టారు కానీ ఇక్కడ రివర్స్ అభివృద్ది జరుగుతుంది. టిక్కెట్లు,మాంసం,చేపల అమ్మకాలను దానిని దురాలోచన అని వారు అనుకుంటున్నారు… మేము దురాలోచన అంటున్నాము. సినిమా టికెట్స్ అమ్మకాలు ప్రభుత్వమే చేపట్టి రాబోయే ఏడాదికి రిలీజ్ కాబోయే సినిమాలు చూపెట్టి దాని నుండి కూడా కొత్తగా రుణాలు తెద్దామనుకుంటున్నారేమో. సినిమా టిక్కెట్లు మేమే అమ్ముతామంటున్నవారు రేపు సినిమాలు కూడా మేమే తీస్తామంటారేమో అని తెలిపారు.
ఇక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు సంబందించి DPR సిద్దం చేసాము. కేంద్రంలోని పెద్దలను,రైల్వే బోర్డు ఛైర్మన్ సునీల్ శర్మ కలిసి విశాఖ రైల్వే జోన్ నీ ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలని కోరాము. స్టీల్ ప్లాంట్ విషయములో కేంద్ర ప్రభుత్వంది విధాన నిర్ణయం తీసుకుంది. నిధుల సేకరణ మాత్రమే కాదు మాన్యుప్యక్షరింగ్ రంగాన్ని బలోపేతం చేయాలనే చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్ విషయములో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సరైందే అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. వెనుకబడిన ప్రాంతాలకు కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం దేనికి ఖర్చు పెట్టారో తేలియదు. అవి బయటపెడితే మిగతా నిధులను కేంద్రం ఇస్తుంది అని పేర్కొన్నారు.