Minister Vidadala Rajini On Medical Colleges In Andhra Pradesh: ఏపీ మంత్రి విడదల రజిని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు. దోచుకో, దాచుకో విధానం చంద్రబాబు పాలనలో జరిగిందని ఆరోపణలు చేశారు. ఒక్క గవర్నమెంట్ కాలేజీ కూడా చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో రాలేదని విమర్శించారు. గుంటూరులో ఆమె మాట్లాడుతూ.. ప్రతి పార్లమెంట్ పరిధిలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారని అన్నారు. ఈ ఏడాది ఐదు మెడికల్ కాలేజీ ప్రారంభించడం ఆనందదాయకమని పేర్కొన్నారు. విజయనగరం, నంద్యాల, ఏలూరు, మచిలీపట్నం, రాజమండ్రిలో ఉన్న ఈ కొత్త మెడికల్ కాలేజీల్లో 750 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి రానున్నాయని చెప్పారు. ఆగస్టు నుంచి అడ్మిషన్స్ ప్రారంభమవుతాయని, సెప్టెంబర్ ఒకటి నుంచి క్లాసులు మొదలవుతాయని తెలిపారు.
Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవల్ గా శరత్ చంద్రారెడ్డి
వందేళ్ల కాలంలో 11 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తే.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని మంత్రి రజిని చెప్పారు. రాష్ట్రంలో రెండు సంవత్సరాల్లో 28 కాలేజీలను అందుబాటులోకి వస్తాయని.. ప్రతి కాలేజీ కోసం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నామని అన్నారు. ప్రతి కాలేజీలో 150 ఎంబీబీయస్ సీట్లు అందుబాటులో ఉంటాయన్నారు. వైద్య ఆరోగ్య శాఖలో దీన్ని ఒక చరిత్రగా మంత్రి అభివర్ణించారు. ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించాలని, రాష్ట్రాన్ని ఆరోగ్య ఆంద్రప్రదేశ్‌గా మార్చడమే సీఎం జగన్ లక్ష్యమని వివరించారు. ప్రతి పేదవాడికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. ఎంబీబీయస్ సీట్లతో పాటు రాష్ట్రంలో 462 పీజీ సీట్లు కూడా పెరిగాయన్నారు. సీఎం జగన్ వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటివరకు వైద్య ఆరోగ్య శాఖలో వైసీపీ ప్రభుత్వం భర్తీ చేసినన్ని ఖాళీలు ఏ ప్రభుత్వమూ చేయలేదని ఉద్ఘాటించారు.
Employees Advance Salary: ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఇకపై అడ్వాన్స్ సాలరీ
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నాలుగేళ్లలో వైద్య ఆరోగ్య శాఖలో 49 వేల పోస్టులను భర్తీ చేశామని మంత్రి రజిని తెలియజేశారు. కానీ.. చంద్రబాబు హయాంలో మాత్రం రాష్ట్రంలో ఒక్క ప్రభుత్వ కాలేజీ రాలేదని విరుచుకుపడ్డారు. చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో సెల్‌ఫోన్ వెలుతురులో ఆపరేషన్లు జరిగాయని గుర్తు చేశారు.