Yanamala Ramakrishnudu: మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు తునిలో జరిగిన టీడీపీ కార్యకర్తల సమావేశంలో చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ఎప్పుడూ ప్రతిపక్షం మీద ఒక కన్నేసి ఉంచాలని, ప్రతిపక్షం బలం అనుకుంటేనే మనం పని చేయగలమని అన్నారు యనమల రామకృష్ణుడు.. ప్రతిపక్షం ఏముందిలే ఊదితే ఎగిరిపోతారు అనుకుంటే పొరపాటు అని.. ప్రతిపక్షం ఊదితే మనం ఎగిరిపోతామని కార్యకర్తలను హెచ్చరించారు.. అయితే, మెడికల్ కాలేజ్ ల నిరసనలో ప్రతిపక్షంలో కసి పెరిగిందని.. ర్యాలీ…
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. గుంటూరు జిల్లా కోర్టు ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా కూడా పాల్గొన్నారు.
YS Jagan: ఆంధ్రప్రదేశ్ లోని ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై మాజీ సీఎం, ఎమ్మెల్యే వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈరోజు నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించిన ఆయన, ప్రభుత్వం చేపడుతున్న ప్రైవేటీకరణను “కుట్ర”గా వర్ణించారు. పేదలకు ఉపయోగపడే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరంగా మార్చడం ద్వారా వారిని అన్యాయానికి లోనుచేస్తారని జగన్ ఆరోపించారు. Funny Groom: అందరి ముందు పరువు పోయిందిగా.. చిన్న పటాక్ పేలితేనే భయపడ్డ వరుడు.. పగలబడి నవ్విన బంధువులు తమ పాలనలో…
MLC Kumbha Ravibabu: దేశ చరిత్రలో ఆరోగ్య శ్రీ ప్రవేశ పెట్టిన ఘనత రాజశేఖర్ రెడ్డిదని వైసీపీ ఎమ్మెల్సీ కుంభ రవిబాబు అన్నారు.. తాజాగా శాసనమండలిలో ఆయన మాట్లాడారు. తండ్రికి తగ్గ తనయుడిగా జగన్ విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారన్నారు.. ప్రతి పార్లమెంట్‌లో మల్టీ హాస్పిటల్స్ పెట్టాలని, పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు పెంచడం కోసం ప్రతి నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్‌లు మొదలు పెట్టారన్నారు.. రాష్ట్రంలో అరకొర సీట్లు సరిపోక ఇతర దేశాలకు…
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా ఇవాళ వైసీపీ ఆద్వర్యంలో ఛలో మెడికల్ కాలేజీలకు పిలుపునిచ్చారు.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నూతన మెడికల్ కళాశాలల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమైంది వైసీపీ..
ఆంధ్రప్రదేశ్ ప్రజారోగ్య రంగంలో 15 సెప్టెంబర్, 2023 ఒక గొప్ప రోజు.. ఒక ముఖ్యమంత్రిగా పరిపాలనా కాలంలో నాకు అత్యంత సంతృప్తిని మిగిల్చిన రోజు.. నేను ఒక మంచి పని చేయగలిగానన్న తృప్తి నాకు లభించింది.. 1923 నుంచి 2019 వరకు ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ రంగంలో కేవలం 12 మెడికల్ కాలేజీలు ఉంటే, ఒక్క మా హయాంలోనే ఒకేసారి 17 మెడికల్ కాలేజీలను సంకల్పించాం అంటూ జగన్ ట్వీట్..
మెడికల్ కాలేజీల వివాదంపై స్పందిస్తూ.. అసలు, పీపీపీ, ప్రైవేటీకరణపై మంత్రి నారా లోకేష్ క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వైద్యం, విద్య ప్రభుత్వ రంగంలోనే ఉండాలని స్పష్టం చేశారు రాఘవులు..