Delhi Liquor Scam : లిక్కర్ స్కాం కేసులో అఫ్రూవల్ గా శరత్ చంద్రారెడ్డి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసుకు సంబంధించి కీలకమైన వ్యక్తి, సౌత్ గ్రూప్ లో ముఖ్య సభ్యుడు శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారుతున్నట్లు తెలిపాడు. దీంతో ఆయన రౌస్ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టును ఇటీవల ఆశ్రయించారు. అప్రూవర్ గా మారుతున్నందుకు అనుమతివ్వాలంటూ కోరాడు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం.. అనుమతులు మంజూరు చేసింది. దానితో పాటు తదుపరి కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లేలా ఈడీకి నోటీసులు జారీ చేసింది.
Also Read : Deepika Ranbir: మళ్లీ కలిసిన మాజీ ప్రేమికులు…
Also Read
ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటి వరకు రూ.100 కోట్ల వరకు ముడుపులు అందాయని.. వీటిలో రూ.30 కోట్లు హైదరాబాద్ నుంచి హవాలా మార్గంలో దిల్లీకి చేరాయని దర్యా్ప్తు సంస్థలు తెలిపాయి. మిగతా రూ.70 కోట్లు దిల్లీలోనే ఏర్పాటు చేసుకున్నట్లు.. దీంతో పాటు దిల్లీ మద్యం విధానం రూపకల్పనలో శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు కోర్టుకు తెలిపాయి సీబీఐ, ఈడీ. శరత్ చంద్రారెడ్డిపై ఛార్జిషీట్ దాఖలు చేసిన సమయంలోనూ ఈడీ అనేక కీలకమైన విషయాలను ప్రస్తావించింది. అంతేకాకుండా హైదరాబాద్, దిల్లీలో జరిగిన సమావేశాలతో పాటు కేజ్రీవాల్ నివాసంలో జరిగిన భేటీల్లో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లు.. వీటన్నింటిలోనూ శరత్ చంద్రారెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు దర్యాప్తు సంస్థలు కోర్టులో ప్రస్తావించాయి.
Also Read : GHMC: లైగికంగా వేధించిన సూపర్ వైజర్.. పారిశుధ్య కార్మికులు ఆందోళన
శరత్ చంద్రారెడ్డిని వారం పాటు ప్రశ్నించిన ఈడీ అధికారులు.. నవంబర్ 11న అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆ తదుపరి కోర్టులో హాజరుపర్చగా.. తిరిగి ఈడీ తమ అదుపులోకి తీసుకుని శరత్ చంద్రారెడ్డిని వారం, పది రోజుల పాటు ప్రశ్నించింది. అనంతరం జైలుకు పంపించారు. జైలుకు పంపించిన రెండ్నెళ్ల తర్వాత తమ బంధువు అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు బెయిల్ మంజూరు చేయాలని శరత్‌చంద్రారెడ్డి కోర్టును ఆశ్రయించారు. బెయిల్ గడువు పూర్తికావస్తున్న తరుణంలోనే తన భార్య ఆరోగ్యం బాగాలేదని.. అందుకు అనుగుణంగా బెయిల్ ఇవ్వాలని శరత్‌చంద్రారెడ్డి కోరగా.. వీటిని పరిగణనలోకి తీసుకుని రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత మళ్లీ శరత్ చంద్రారెడ్డి దిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యం బాగాలేదని కోర్టుకు వివరించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. తాము ఆరోగ్య కారణాల రీత్యా మాత్రమే బెయిల్ మంజూరు చేస్తున్నామని… కోర్టుకు విధించిన షరతులకు లోబడే వ్యవహరించాలని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణ పూర్తి చేసేందుకు ఈడీ సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Petrol Attack: ఆదోనిలో దారుణం.. మహిళపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఇద్దరు మహిళలు!
-
Thudakkam OTT Release: విస్మయ మోహన్‌లాల్ తొలి సినిమా ఓటీటీలోకి.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
-
OnePlus Ace 7 Pro: 200MP కెమెరా, 16GB RAMతో వన్‌ప్లస్ Ace 7 Pro.. ఫీచర్లు లీక్!
-
Maruti Baleno Facelift 2026: కొత్త మారుతి బాలెనో ఫేస్‌లిఫ్ట్ విడుదల.. 1.2L Z-Series ఇంజన్, Level-2 ADAS
-
Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, పండగే ఇవాళ!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!