Minister Seediri Appalaraju Challenges Pawan Kalyan To Contest From Kakinada: జనసేనాధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వ్యభిచారి అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే.. కాకినాడ జిల్లా నుంచి పోటీ చేసి పవన్ కళ్యాణ్ గెలవాలని సవాల్ విసిరారు. పవన్ తాగేసి మాట్లాడే ఓ పనికిమాలినోడని విమర్శించారు. చంద్రబాబు ఇచ్చే స్క్రిప్ట్ చదవడం తప్ప, ఇంకేమీ తెలియదని ఎద్దేవా చేశారు. సచివాలయాల్లో ఎలాంటి సేవలందిస్తారో తెలుసా? అని పవన్‌ని నిలదీశారు. నిన్ను కూడా పీకే గాడు, వీపీ గాడు అని తాము ఏకవచనంతో అనలేమా? అని అన్నారు. తమకు సంస్కారం అడ్డు వస్తోందన్నారు. జన్మభూమి కమీటీలు అరాచకాలు చేసినప్పడు.. పవన్ కళ్యాణ్ ఐస్‌క్రీమ్ తింటున్నాడా? అని నిలదీశారు.
Minister RK Roja: పవన్ కళ్యాణ్‌కి ఫ్యాన్స్ ఉంటే, జగన్‌కు సైన్యముంది.. మంత్రి రోజా కౌంటర్
గతంలో కూడా పవన్‌పై మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అసలు ఎక్కడి నుంచి పోటీ చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్ కళ్యాణ్ కనీసం ఎమ్మెల్యే కూడా కాకుండా, ముఖ్యమంత్రి ఎలా అవుతారని ప్రశ్నించారు. అసలు పవన్ ఈసారి ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తాడో ముందుగానే చెప్పాలని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలంటే 88 మంది ఎమ్మెల్యేలు గెలవాలని.. అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేయలేనప్పుడు, పవన్ సీఎం ఎలా అవుతారని నిలదీశారు. ఏదో కార్యకర్తలను ఉత్సాహపరచడానికే ముఖ్యమంత్రి అవుతానని పవన్ కళ్యాణే చెప్తున్నారే తప్ప, ఆయన వ్యాఖ్యల వెనుక సీరియస్‌నెస్ లేదన్నారు. పవన్ కళ్యాణ్ మాటలకు, చేతలకు పొంతనే ఉండదని.. పవన్ నిలకడ లేని రాజకీయ నేత అని దుయ్యబట్టారు. అసలు వైసీపీ రహిత ఆంధ్రప్రదేశ్ ఎందుకు చెయ్యాలో పవన్ కళ్యాణ్ చెప్పాలని డిమాండ్ చేశారు.
Pawan Kalyan: ఏపీలో బలమైన మార్పు తేవాలి.. జనసేనని ఎవరు అడ్డుకుంటారో చూద్దాం
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు వంట పాడటమే పవన్ చేసిన మొదటి తప్పు అని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. చంద్రబాబు వెనుక వెళ్తే పవన్ ముఖ్యమంత్రి కాదు కదా.. ఎమ్మెల్యే కూడా కాలేడన్నారు. సీఎం జగన్‌ని తిట్టడమే తిట్టడమే పవన్ అజెండా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అధికారంలోకి వచ్చాక.. మునుపెన్నడూ లేని విధంగా రాష్ట్రం అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు. పేద ప్రజలకు నేరుగా సంక్షేమ పథకాలు ఇస్తున్నామన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుస్తుందని, జగన్ మరోసారి సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు.