Minister Satya kumar: ఉద్దానం విషయంలో రాద్దాంతం చేస్తున్నారు అని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఇలా చేస్తే 11 సీట్లు కూడా ఈసారి రావు.. ప్రజలు చిత్తుగా ఓడించారని జగన్ కక్ష కట్టాడు అని పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం జరగకుండా అడ్టు పడుతున్నారు.
కూటమి ప్రభుత్వానికి ఏడాది గడిచింది.. హనీమూన్ పీరియడ్ ముగిసింది.. ఇక నుంచి యుద్ధం చేయాల్సిందే.. కాబట్టి అందరినీ కలుపుకుపోవాలి.. ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్.. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం.. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి. వారికి అందుబాటులో ఉండాలి. ప్రజల సమస్యలపై పోరాడాలి. అప్పుడే మనం సత్తా చూపగలం అని సూచించారు.
కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవ సభ ఎల్లుండి జరగనుంది. సుపరిపాలన.. తొలి అడుగు పేరుతో సభ నిర్వహించనున్నది ఏపీ ప్రభుత్వం. ఏపీ సచివాలయం వెనక ప్రాంతంలో సభ నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభలో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు.. భవిష్యత్తు కార్యాచరణ.. సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ వివరించనున్నారు. ప్రభుత్వం ప్రాధాన్యాలు.. పి 4పై ప్రత్యేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది. ఎమ్మెల్యేలు మంత్రులు మొదటి వార్షికోత్సవ సభలో…
సుపరిపాలన కాదు సుద్దు దండగా పాలన అని మాజీ మంత్రి ఆర్‌కే ఆరోజా అన్నారు. రూ.1,60,000 కోట్లు అప్పు చేయడం సుపరిపాలన? అని ప్రశ్నించారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. "రూ. 81వేలకోట్లు ప్రజలకు ఎగనామం పెట్టడం సుపరిపాలన ? సూపర్ సిక్స్ అమలు చేయకపోవడమే సుపరిపాలన అంటారా? ఆడపిల్లను అత్యాచారాలు చేయడం చంపడం సుపరిపాలన ? రాష్ట్రం మొత్తం గంజాయి డ్రగ్స్ డోర్ డెలివరీ చేయడం, విద్యుత్ ఛార్జీలు పెంచడం సుపరిపాలన అంటారా? సీబీఎన్ అంటేనే…
Vijayawada: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తైన సందర్భంగా “సుపరిపాలన… తొలి అడుగు” పేరుతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సభ ఈ రోజు (జూన్ 12) సాయంత్రం 5 గంటలకు విజయవాడ సమీపంలోని పోరంకి మురళి రిసార్ట్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రిమండలి సభ్యులు, కూటమి ఎమ్మెల్యేలు, తదితర ప్రజాప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ప్రభుత్వ ఉన్నతాధికారులందరూ ఈ సమావేశానికి తప్పనిసరిగా హాజరుకావాలని…
CM Chandrababu : ఏపీ ఎన్నికల ఫలితాలు వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా, ప్రజల తీర్పుపై సీఎం చంద్రబాబు నాయుడు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా స్పందించారు. నాటి ప్రజా తీర్పు ద్వారా రాష్ట్రంలో ఉన్మాద పాలనను తుది గా అడ్డుకున్నామని ఆయన పేర్కొన్నారు. వచ్చే నాలుగేళ్లలో కూటమి ప్రభుత్వంలో మరింత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రజలకు, కూటమి పార్టీల కార్యకర్తలు, నేతలకు ఆయన అభినందనలు తెలియజేశారు. “జూన్ 4….…
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నెలలో 15 రోజులు, రెండు పూటలా రేషన్ సరకుల పంపిణీ చేపట్టనున్నట్లు తెలిపారు. ఆ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. పేదలకు ప్రభుత్వం అందించే రేషన్ సరుకుల చౌక ధరల దుకాణాలు గత ప్రభుత్వంలో మూసేసి, ఇంటింటికి అందిస్తాం అని రూ.1600 కోట్లతో వాహనాలు కొనుగోలు చేసిన విషయాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం అలర్ట్ అయ్యింది.. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న జిల్లాల్లో ఇంఛార్జి మంత్రులతో రేపు కూటమి నేతల సమావేశం జరగనుంది. ఆయా జిల్లాలో ఉన్న కూటమి నేతలైన టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులతో ఇంఛార్జి మంత్రులు సమావేశమవుతారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చ జరగనుంది.
టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. పలు అంశాలపై చర్చ పోలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. మహానాడు రెండు రోజుల పాటు నిర్వహించాలని నిర్ణయించారు. కడప జిల్లాలో మహానాడు నిర్వహించనున్నారు. జిల్లాల పునర్విభజన పై పొలిట్ బ్యూరోలో చర్చ జరిగింది. వైసీపీ హయాంలో స్థానిక సంస్థల్లో తగ్గిన బీసీ కోటా రిజర్వేషన్ పునరుద్ధరించేలా చట్టపరమైన అంశాలు పరిశీలించాలని సీఎం చంద్రబాబు సూచించారు.
వైసీపీ హయాంలో తప్పు చేసిన వారిని శిక్షించేందుకు ప్రత్యేక ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. "వైసీపీ పెట్టిన అక్రమ కేసుల్ని నిర్ణీత కాలపరిమితిలో ఎత్తివేసేలా చూడాలని నిర్ణయించాం. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగేలా వారికి చెల్లించాల్సిన మొత్తం భూమి రూపంలో ఇచ్చేలా ఆలోచన చేస్తున్నాం.