Minister Roja: చంద్రబాబూ.. విజన్ సరే, ఏపీకి ఏం చేశావ్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Roja Fires On Chandrababu Naidu: ఏపీ మంత్రి రోజా మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. విజన్ ఉంది, విస్తరాకుల కట్ట ఉందంటూ చంద్రబాబు మాయమాటలు చెప్తుంటారని విమర్శించారు. సెల్‌ఫోన్ కనిపెట్టాను, కంప్యూటర్ కనిపెట్టాను, హైదరాబాద్ కనిపెట్టాను అని చెప్పుకునే చంద్రబాబు.. ఏపీకి ఏం చేశావయ్య అంటే మాత్రం చెప్పడానికి ఏమీ ఉండదంటూ ఎద్దేవా చేశారు. గండికోటలో ఒబెరాయ్ హోటల్ నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ ఆదివారం భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి రోజా మాట్లాడుతూ.. తాము నిజమైన పారిశ్రామికవేత్తలతో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు తెస్తే.. పని మనుషులు, డ్రైవర్లతో MOUలు చేసుకున్న ఘనుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. బాబు పాలనలో లిక్కర్ ఫ్యాక్టరీలనే పారిశ్రామిక ప్రగతిగా డబ్బా కొట్టుకున్నారని మండిపడ్డారు.
SSMB 29: రాజమౌళి సినిమా కోసం మహేష్‌కి స్పెషల్ ట్రైనింగ్…ఆ 3 నెలలు మిస్సింగే ఇక!
Also Read
- CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
- Rajahmundry Theft Case: భారీ పగటి దొంగతనం కేసు ఛేదన.. రూ.53.51 లక్షల విలువైన బంగారు ఆభరణాలు స్వాధీనం!
- IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
- AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
సీఎం జగన్‌పై ఉన్న నమ్మకంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడా పారిశ్రామిక వేత్తలు క్యూ కడుతున్నారని మంత్రి రోజా అన్నారు. తాము రూ.13 లక్షల కోట్ల మేర MOUలు చేసుకున్నామని.. రాష్ట్ర అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోందని చెప్పారు. కానీ.. ఎల్లో మీడియా మాత్రం రాష్ట్రం నుంచి పరిశ్రమలు వెళ్లిపోతున్నాయంటూ తప్పుడు ప్రచార చేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో జగన్ పాలన చూసి.. అందరూ శభాష్ అంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ అంటే కేవలం పేరు మాత్రమే కాదని, అదొక బ్రాండ్ అని కొనియాడారు. రికార్డు సృష్టించాలన్నా, బద్ధలు కొట్టాలన్నా జగన్‌కే సాధ్యమంటూ.. బాలయ్య శైలిలో సింహా సినిమాలోని డైలాగ్‌ని ఉచ్ఛరించారు. ఏపీలో రాబోయే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిపించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. జగనన్న వన్స్‌మోర్ అని ప్రజలు అంటున్నారని, తప్పకుండా మరోసారి వైసీపీ ప్రభుత్వమే వస్తుందని మంత్రి రోజా ధీమా వ్యక్తం చేశారు.
MP Mithun Reddy: ముందస్తు ఎన్నికలు ఉండవు.. ఆయన వస్తానంటే స్వాగతిస్తాం
తాజావార్తలు
-
Rupee vs Dollar: RBI 4 కీలక నిర్ణయాలు.. డాలర్‌తో పోలిస్తే 97 పైసలు బలపడిన రూపాయి!
-
CM Chandrababu: తిరుపతిని దివ్యక్షేత్రంగా తీర్చిదిద్దాలి.. రెండేళ్లలో పిలిగ్రిమ్ టౌన్షిప్ పూర్తి చేయాలి!
-
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ @30 ఏళ్ల సినీ ప్రస్థానం..
-
Jantar Mantar: ఢిల్లీ పోలీసుల సంచలన నిర్ణయం.. నిరసనల వేదికగా జంతర్ మంతర్ తొలగింపు!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
ట్రెండింగ్
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!