Slum Dog 33 Temple Road: అదిరిపోయిన టబు గెటప్.. పూరీ ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ నుంచి మైండ్ బ్లోయింగ్ గ్లింప్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Slum Dog 33 Temple Road: పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో విజయ్ సేతుపతి, టబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్రల కూర్పు ఎలా ఉండబోతోందనే క్యూరియాసిటీ మాత్రం ఆడియన్స్ లో పెరుగుతోంది. అయితే ఈ రోజు 11 గంటలకు రిలీజ్ చేసిన గ్లింప్స్ చూస్తే ఆ క్యూరియాసిటీ మరింత పెరిగేలా కనిపిస్తోంది. ఆమెను రొమాంటిక్ నటిగా ఇప్పటిదాకా చూసి ఉంటారు. అయితే పవర్ఫుల్ డిప్యూటీ కమిషనర్ పాత్రలో టబు కనిపించిన తీరు మాత్రం సినిమాకే హైలెట్ కానుంది. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు టబు పాత్రను పరిచయం చేస్తూ మేకర్స్ విడుదల చేసిన పోస్టర్, గ్లింప్స్ సినిమాకు మరింత క్రేజ్ తీసుకొచ్చాయి.
ఈ సినిమాలో టబు ‘గౌరీ హెగ్డే’ పాత్రలో కనిపించనున్నారు. ఆమె పాత్రను పరిచయం చేస్తూ ‘ఆమెతో పెట్టుకోవడం అంత ఈజీ కాదు’ అనే క్యాప్షన్‌ను చిత్రబృందం ఉపయోగించింది. ఈ ఒక్క మాటతోనే గౌరీ హెగ్డే పాత్ర ఎంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందనే ఆసక్తి మొదలైంది. అనంతరం ఈ రోజు ఉదయం 11 గంటలకు విడుదలైన ప్రత్యేక గ్లింప్స్‌లో టబు డిప్యూటీ కమిషనర్
అధికారిణి గెటప్‌లో కనిపించారు. గ్లింప్స్‌లో టబు కనిపించిన తీరు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. ఆపాత్రలో ఆమె చూపించిన గంభీరత, యాటిట్యూడ్, స్క్రీన్ ప్రెజెన్స్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఒక్కొక్కరిని భయపెడుతున్న తీరు చూస్తుంటే గూస్ బంప్స్ పక్కాగా వచ్చేలా ఉన్నాయి.
Also Read
- Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ 'కాకా' లేనట్టేనా..?
- Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
- Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
- Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ - ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ఇక విజయ్ సేతుపతి పాత్ర కూడా ఈ సినిమాకు మరో ప్రధాన ఆకర్షణగా మారింది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌లో ఆయన అంధుడైన బిచ్చగాడి పాత్రలో కనిపించారు. అయితే విజయ్ సేతుపతి నిజంగానే అంధుడా? లేక అలా నటిస్తున్నాడా? ఈ ప్రశ్నలకు సమాధానమే సినిమాలోని మైన్ ట్విస్ట్‌లలో ఒకటిగా ఉండబోతుందని సమాచారం. స్లమ్ ప్రాంతాల్లో నివసించే పేదలు, అనాథలను క్రిమినల్ గ్యాంగుల నుంచి కాపాడే వ్యక్తిగా విజయ్ సేతుపతి పాత్రను పూరీ జగన్నాథ్ డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో గౌరీ హెగ్డే పాత్రలో టబు ఎంట్రీ మరింత ఆసక్తికరంగా మారింది. ఒకవైపు చట్టం, మరోవైపు స్లమ్ ప్రాంతాల్లో జరుగుతున్న నేరాలు, మధ్యలో అంధుడైన బిచ్చగాడి రూపంలో ఉన్న విజయ్ సేతుపతి పాత్ర ఉండటంతో కథ ఏ స్థాయిలో ఉంటుందో అనే ప్రశ్న తలెత్తుతోంది. ఈ రోజు రిలీజ్ అయిన గ్లింప్స్ కూడా చాలా ఇంటెన్స్ గా సాగుతాయి. టబు దొరికినవాన్ని దొరికినట్టే లాకప్ లో వేసి భయపెట్టే సీన్స్ చాలా ఉత్కంఠంగా అనిపిస్తున్నాయి.
‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’ను పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్, జె.బి. నారాయణరావు కొండ్రొల్ల నిర్మిస్తున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌ను చూస్తే ‘స్లమ్ డాగ్: 33 టెంపుల్ రోడ్’లో సాధారణ కమర్షియల్ యాక్షన్ కంటే మిస్టరీ, క్రైమ్, యాక్షన్ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యం ఉన్నట్లు కనిపిస్తోంది. విజయ్ సేతుపతి అంధుడైన బిచ్చగాడి పాత్ర, టబు పవర్ఫుల్ క్యారెక్టర్ సినిమాకు రెండు కీలకమైన అంశాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా టబు గ్లింప్స్‌కు వచ్చిన స్పందన చూస్తుంటే, గౌరీ హెగ్డే పాత్ర సినిమా కథను ఏ స్థాయిలో మలుపు తిప్పుతుందో తెలుసుకోవాలనే ఆసక్తి ఇప్పుడు మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Konda Surekha: ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలోనే బిగ్ అప్డేట్.. వేచి చూడండి!
-
Kaaka : వచ్చే సంక్రాంతికి మెగాస్టార్ ‘కాకా’ లేనట్టేనా..?
-
Kareena Kapoor: ఆ టైంలో హీరోయిన్ అవ్వాలనే పిచ్చితో అలా చేశాను.. కానీ ఇప్పుడు అది బిగ్ రిగ్రెట్!
-
Irumudi: 200 కోట్లు దాటినా తగ్గని ‘ఇరుముడి’ జోరు.. సెప్టెంబర్ లో మరింత జోరు ఉంటుందా ?
-
Ram Charan: మెగా ఫ్యామిలీ స్పెషల్ ఫోటో.. ముగ్గురు పిల్లలతో రామ్ చరణ్ – ఉపాసన జన్మాష్టమి వేడుకలు!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!