Tadipatri Tension: తాడిపత్రిలో పొలిటికల్ హీట్.. వైసీపీ–టీడీపీ పోటాపోటీ కార్యక్రమాలు.. పోలీసుల నో పర్మిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tadipatri Tension: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో వైసీపీ, టీడీపీలు తలపెట్టిన రాజకీయ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ కోరుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో నిరసన ర్యాలీకి వైసీపీ పిలుపునివ్వగా.. మరోవైపు ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించేందుకు టీడీపీ సిద్ధమైంది. అయితే, రెండు ప్రధాన పార్టీల కార్యక్రమాలకు ఎలాంటి పోలీసు అనుమతులు లేవని తాడిపత్రి ఇన్చార్జి డీఎస్పీ ఏ. శ్రీనివాస్ స్పష్టం చేశారు. పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, సాధారణ ప్రజల జీవనానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
డీఎస్సీలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. అదే సమయంలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ ఇంటింటికీ కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించింది. దీంతో పట్టణంలో ఇరుపార్టీల కార్యకలాపాలపై ఉత్కంఠ నెలకొంది. పోలీసుల అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించడం లేదా పెద్ద సంఖ్యలో గుమిగూడేందుకు ప్రయత్నించడం చేస్తే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడేందుకు అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, కార్యకర్తలు పోలీసులకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా తాడిపత్రి పట్టణంలో అదనపు పోలీసు బలగాలను మోహరించారు. పలు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నిస్తే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు.
Also Read
- Ganesh Immersion Without Water: నీళ్లు లేవు గణపయ్య.. క్షమించవయ్యా.. ఎండిన కాలువలోనే విగ్రహాలు..
- Minister Payyavula Keshav: ఈ ఏడాది సాగు నీరు ఇవ్వలేం.. మంత్రి పయ్యావుల కీలక ప్రకటన
- Kethireddy Venkatarami Reddy: సెలబ్రిటీల మౌనంపై కేతిరెడ్డి ఘాటు వ్యాఖ్యలు.. పద్మశ్రీల భయమా..?
- Off The Record: సొంత పార్టీ నేతలకు కేతిరెడ్డి బ్యాడ్ మార్నింగ్?
డీఎస్పీ సూచనలు..
* శాంతి భద్రతలకు ప్రాధాన్యం : తాడిపత్రి పట్టణంలో శాంతి భద్రతలకు ఎలాంటి భంగం కలగకుండా చూసేందుకు అన్ని రాజకీయ పార్టీలు, వాటి నాయకులు మరియు కార్యకర్తలు పూర్తిస్థాయిలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
* ఆంక్షలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు : పోలీస్ అనుమతి లేకుండా ఎలాంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు లేదా గుమ్మిగూడే ప్రయత్నాలు చేసినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
* భద్రత పెంపు : పట్టణంలో ముందస్తు జాగ్రత్త చర్యగా అదనపు పోలీస్ బలగాలను మోహరించడం జరిగిందని, ఎక్కడికక్కడ చెక్ పోస్ట్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు ప్రయత్నం చేస్తే, వారిపై చట్టపరమైన కఠినమైన కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
తాజావార్తలు
-
Abhishek Sharma: అంతర్జాతీయ క్రికెట్లోనే ఇదే మొదటిసారి.. అభిషేక్ రికార్డు బ్రేక్ కాదేమో ఇగ!
-
Agniveer Jobs 2026: అగ్నివీరులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో కొత్త అవకాశాలు.. రిజర్వేషన్, రూల్స్ ఇవే
-
OTT Releases: ఈ రోజు ఓటీటీలోకి కిర్రాక్ కంటెంట్.. హాలీవుడ్ థ్రిల్లర్ లనుంచి కొరియన్ రొమాంటిక్ డ్రామాల దాకా
-
KTR: “రూ.1000 కోట్లు ఇస్తే మా ఆస్తులన్నీ ఇచ్చేస్తా”.. సీఎం రేవంత్‌రెడ్డికి కేటీఆర్ ఆఫర్.. ..
-
IRUMUDI OTT : ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్న సెన్సషనల్ బ్లాక్ బస్టర్ ‘ఇరుముడి’
ట్రెండింగ్
-
Floor Cleaning Tips: ఇల్లు తుడిచాక నేల జిడ్డుగా మారుతోందా? ఈ తప్పులే కారణం.. ఇలా చేస్తే మెరిసిపోతుంది!
-
Abhishek Sharma: కెరీర్ మొదలెట్టి రెండేళ్లే.. అప్పుడే కింగ్ కోహ్లీ సరసన అభిషేక్.. టీ20ల్లోనే అరుదైన రికార్డు!
-
Garlic Karam: వెల్లుల్లి కారం ముద్దముద్దగా అవుతుందా.? ఇలా చేయండి పొడిపొడిగా నెలల తరబడి తాజాగా ఉంటుందంటే.!
-
Soft and Puffy Poori: పూరి బాగా పొంగి, మృదువుగా రావాలంటే ఏం చేయాలంటే.?
-
Abhishek Sharma Century: 30 బంతుల్లోనే అభిషేక్ శతకం.. ఫాస్టెస్ట్ సెంచరీ ఇది కాదు.. ప్రపంచ రికార్డు ఎవరిదంటే?