Fishermen Boat Stuck In Ullapalem Sea: మాండూస్ తుఫాన్ కారణంగా.. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్లపాలెం సముద్రతీరంలో అల్లకల్లోల వాతావరణం నెలకొంది. దీంతో.. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల మరబోటు చిక్కుకుంది. అందులో ఓడరేవుకు చెందిన ఏడుగురు మత్స్యకారులు ఉన్నారు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి, వారిని కాపాడేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. తుఫాను తీవ్రతతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. ఈ సహాయక చర్యల్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు పర్యవేక్షిస్తున్నాయి. ఆ మత్స్యకారులు ఆరు రోజుల ముందు సముద్రంలో వేటకు వెళ్లినట్టు తెలిసింది. తమ వద్ద ఉన్న ఫోన్ ద్వారా మత్స్యకారులు పోలీసులకు లొకేషన్ షేర్ చేశారు. వర్షం, తీవ్రగాలుల ధాటికి ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారి వద్దకు చేరలేకపోతున్నారు. దీంతో.. మరో బోటు సహాయంతో వారిని రక్షించేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు.
Mandous Cyclone Live Updates: మాండూస్ విలయం.. లైవ్ అప్‌డేట్స్
కాగా.. మాండూస్ తుఫాన్‌కి ఏపీలోని చాలా రాష్ట్రాలు ఎఫెక్ట్ అయ్యాయి. చాలాచోట్ల అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. చాలావరకు జలాశయాలు నిండుకుండల్లా మారిపోయాయి. జలాశయాల్లో భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో.. ఆయా జలాశయాల నుంచి భారీ స్థాయిలో నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో.. పరివాహక ప్రాంతాలు భయాందోళనలకు గురవుతున్నాయి. ఈ మాండూస్ తుఫాన్ చాలా ఆస్తినష్టం సంభవించింది. పలుచోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో.. రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. కొన్ని చోట్ల విద్యుత్ సేవలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. కొన్ని చోట్ల జనాలు ఇల్లు వదిలి, రోడ్లపైకి వచ్చేశారు. చిత్తూరు జిల్లా అయితే ఈ తుఫాన్ వల్ల అతలాకుతలం అయ్యింది. తిరుమలలో పాపవినాశనం, గోగర్భం డ్యాంను నిండిపోయాయి. అటు.. వరద నీరు మెట్లపై ప్రవహిస్తుండడటంతో, శ్రీవారి మెట్టు మార్గాన్ని మూసివేశారు. వర్షం తగ్గేంత వరకు భక్తులకు అనుమతి లేదని టీటీడీ అధికారులు తేల్చేశారు.
Vidadala Rajini: చంద్రబాబుకు అది తప్ప.. మరే ధ్యాసే లేదు