ఏపీ ప్రభుత్వంపై పథకం ప్రకారం దుష్ప్రచారం జరుగుతోందని, దీనిని ప్రజలు నమ్మరని అన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. ఒక పథకం ప్రకారం అనుకూల మీడియా ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారు. నిత్యం ప్రభుత్వం పై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారు. వాటికి వివరణ ఇస్తున్నా..ప్రభుత్వం పై బురద చల్లుతున్నారు. పంటల బీమా పై తప్పుడు కథనాలు రాస్తున్నారు.. పండించిన ప్రతి పంటకూ బీమా కల్పిస్తున్నాం. ప్రతి రైతుకూ బీమా కల్పించాలనే లక్ష్యంతో వంద శాతం ప్రీమియం ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు మంత్రి కాకాణి.
దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలా చేయడం లేదు. వైసీపీ అధికారంలోకి రూ. 6 వేల 684 కోట్ల మేర బీమా మొత్తం చెల్లించాం. టిడిపి హయాంతో పోలిస్తే ఇది రెట్టింపు మొత్తం అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. ఇప్పుడు కరువు మండలమే లేదు. వర్షాలు పుష్కలంగా పడుతున్నాయన్నారు. ఏటా 14 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతోంది.
Read Also:Buffalo Died: నాగేదె చనిపోవడానికి కారణం హెలికాప్టర్.. పోలీసులకు ఫిర్యాదు
ప్రకృతి సహకరిస్తోంది..అందుకే పంటలు బాగా పండుతున్నాయి.కొన్ని మీడియా సంస్థలు స్వలాభం కోసం తప్పుడు వార్తలు రాస్తున్నాయి.నారా లోకేష్ వ్యవసాయం గురించి మాట్లాడటం హస్యాస్పదంగా వుంది. 10 పంటల్లో. ఐదు పంటలు కూడా గుర్తించలేని పవన్ కళ్యాణ్..వ్యవసాయం గురించి మాట్లాడుతున్నారు. రైతులకు వాస్తవాలు తెలుసు…తప్పుడు వార్తలు నమ్మరు. ఇప్పటికైనా ఆ మీడియా సంస్థలు తమ ధోరణి మార్చుకోవాలని హితవు పలికారు.
Read Also: Koti Deepotsavam 2022: చివరి రోజు కోటి దీపోత్సవం… ఈరోజు విశేష కార్యక్రమాలు