Buffalo Died: ఏదైనా ఫన్సీ ఇన్సిడెంట్స్ లు మనం చదివి కడుపుబ్బా నవ్వుకుంటుంటాం. ఎందుకంటే అవి జరుగుతాయా? అనే ప్రశ్నలు మన మెదుడులో కదులుతాయి కాబట్టి. నిజం చెప్పాలంటే అవి అలా జరగవు క్రియేట్ అవుతాయి. ఓ గేదె చనిపోయింది. దానికి కారణం పైలెట్ నడిపిన హెలికాప్టర్ శబ్దం. ఫన్నీగా ఉంది కదూ.. అవును యజమాని పైలెట్ పై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వింత ఘటన రాజస్థాన్ లో జరిగింది.
Read also: Koti Deepotsavam 2022: చివరి రోజు కోటి దీపోత్సవం… ఈరోజు విశేష కార్యక్రమాలు
రాజస్థాన్ లోని అల్వార్ జిల్లా బహ్రోడ్ నియోజకవర్గ ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ వస్తున్నాడని కార్యకర్తలు అతడ్ని స్వాగతించడానికి ఘనంగా ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగానే హెలికాప్టర్ నుంచి తమ ప్రియతమ నాయకుడిపై పూల వర్షం కురిపించాలని నిర్ణయించారు. అనుకున్నట్లుగానే ఆదివారం హెలికాప్టర్ నుంచి ఎమ్మెల్యేపై పూల వర్షం కురిపించారు. అయితే ఆ హెలికాప్టర్ బహ్రోడ్ ప్రాంతంలో కొన్నిసార్లు చక్కర్లు కొట్టింది. అనంతరం కోహ్రానా అనే గ్రామం మీదుగా వెళ్లింది. తక్కువ ఎత్తులో ప్రయాణించడం వల్ల పెద్ద శబ్దం వచ్చింది. దానివల్లే రూ.1.5 లక్షల విలువైన గేదె మృతిచెందిందని ఆ గ్రామానికి చెందిన బల్వీర్ అనే వృద్ధుడు ఆరోపించాడు. అంతేకాదు హెలికాప్టర్ పైలట్ నిర్వాకంపై ఆగ్రహించిన బల్వీర్.. అతడిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చనిపోయిన గేదెను పరీక్ష నిమిత్తం వెటర్నిటీ ఆస్పత్రికి తరలించారు. అయితే.. పరీక్ష నివేదిక అనంతరం గేదె ఎలా చనిపోయిందో తెలుస్తుందని, దాని ఆధారంగా కేసు నమోదు చేస్తామని తెలిపారు.
Naomi Biden: జో బిడెన్ మనవరాలి వివాహం.. వైట్‌హౌజ్‌లో జరుగుతున్న ఎన్నో పెళ్లో తెలుసా..?