లక్షలాదిమంది భక్తుల్లో భక్తి పారవశ్యం కలిగించిన భక్తి టీవీ కోటిదీపోత్సవం చివరి అంకానికి చేరుకుంది. ఈరోజుతో కోటి దీపోత్సవం ముగియనుంది. అక్టోబర్ 31వ తేదీన ప్రారంభం అయిన భక్తి టీవీ కోటిదీపోత్సవం ప్రతి రోజూ వినూత్న ఆధ్యాత్మిక కార్యక్రమాలతో భక్తుల ప్రశంసలు అందుకుంది. ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల సంయుక్త ఆధ్వర్యంలో భక్తి టీవీ కోటిదీపోత్సవం కనుల పండువగా సాగుతోంది. వేలాదిమంది భక్తులు ఈ కోటిదీపోత్సవాన్ని కనులారా వీక్షించి తరిస్తున్నారు. భాగ్యనగరం భక్తి టీవీ కోటిదీపోత్సవ వేడుకతో అలరారుతోంది. సాయంత్రం 4 గంటల నుంచే భక్తులు ఎన్టీఆర్ స్టేడియం వైపు పరుగులు తీస్తున్నారు. కార్తీక మాసంలో సోమవారానికి ఎంతో ప్రాముఖ్యత వుంది. ఇవాళ్టితో కోటి దీపోత్సవం ముగియనుంది. కోటిదీపోత్సవం-2022లో పల్లకీ సేవలు, ప్రవచనాలు, అనుగ్రహ భాషణలు, సప్త హారతి, కల్యాణోత్సవాలు, కుంకుమార్చనలు, దీపోత్సవాలతో ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది.
ఆదివారం కార్యక్రమం విశేషంగా, వైభవంగా సాగింది. 14వ రోజు భక్తి టీవీ నిర్వహిస్తోన్న కోటీ దీపోత్సవం కార్యక్రమానికి మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో భక్తి టీవీ నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం కార్యక్రమంలో పాల్గొనటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దీపం జ్ఞానానికి చిహ్నం, వెలుగు అభివృద్ధికి మార్గం.. అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి సమాజాన్ని విజ్ఞానం దిశగా జాగృతం చేయటమే ఇలాంటి కార్యక్రమాల్లోని అంతరార్థమని చెప్పారు. శ్రీమతి రమాదేవి, శ్రీ నరేంద్ర చౌదరి దంపతులు ఎంతోకాలంగా సమాజం బాగు కోరి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.
Koti Deepotsavam Advertisement
కోటి దీపోత్సవం 15వ రోజు కార్యక్రమాలివే
అనుగ్రహ భాషణం: శ్రీ విద్యాప్రసన్న తీర్థ స్వామీజీ (శ్రీ కుక్కు సుబ్రహ్మణ్య స్వామి మఠం)
ప్రవచనామృతం: ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి వేంకటేశ్వరరావు
వేదిక పై పూజ: మహాదేవునికి కోటి రుద్రాక్షల అర్చన
భక్తులచే పూజ: శివలింగానికి కోటి రుద్రాక్షల అర్చన
కల్యాణం: శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణోత్సవం
పండరీ పురం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి పరిణయం
వాహన సేవ: నందివాహనం, చంద్రప్రభ వాహనం
Fhdwcs5uaaauz1g