కృష్ణా జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ హాట్ గా వుంటాయి. ముఖ్యంగా మైలవరంలో హాట్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. మంత్రి జోగి రమేష్ వర్సెస్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. సీఎం కాంప్ కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డితో మంత్రి జోగి రమేష్ భేటీ అయ్యారు. మైలవరం నియోజకవర్గ వివాదం పై చర్చ జరిగిందని తెలుస్తోంది. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తనపై చేసిన ఆరోపణలపై మంత్రి జోగి రమేష్ వివరణ ఇచ్చారు.
ఇదిలా వుంటే.. నిన్న సజ్జలతో సమావేశం అయిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ భేటీ అయి తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన కామెంట్లు, తదితర పరిణామాలను వివరించిన సంగతి తెలిసిందే. పనిలో పనిగా మంత్రి జోగి రమేష్ పై ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్. ఎన్టీవీతో మాట్లాడిన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ పలు ఆరోపణలు చేశారు. నన్ను పార్టీలో కొంతమంది కావాలని ఇబ్బంది పెడుతున్నారని, నా పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని అధిష్టానానికి కంప్లైంట్ చేశారు.
Read Also: Asaduddin Owaisi: “మీరు పెళ్లి చేసుకోండి”.. మోదీ సర్కార్‌ను నమ్మవద్దు.
తాను పార్టీ మారతానని, మరో జిల్లా నుంచి పోటీ చేస్తానని ప్రచారం చేస్తున్నారు. నేను పోటీ అంటూ చేస్తే కచ్చితంగా మైలవరం నుంచే బరిలో ఉంటా. నేను, నా కొడుకు జీవిత కాలం వైసీపీలోనే ఉంటాం. నన్ను ఇబ్బంది పెడుతున్న విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకుని వెళ్ళానన్నారు. ఆధారాలతో సహా చూపించానన్నారు. ముఖ్యమంత్రి దృష్టికి కూడా ఈ అన్ని విషయాలు తీసుకుని వెళతానన్నారు. ఇతర విషయాలు పట్టించుకోవద్దు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పని చేసుకోమ్మని సజ్జల సూచించారని నిన్ననే కామెంట్ చేశారు.
మైలవరం నియోజకవర్గంలో కొంతకాలంగా స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్, జిల్లా మంత్రి జోగి రమేష్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న వేళ, ఆవివాదానికి వైసీపీ అధిష్టానం ఏవిధంగా చెక్ పెడుతుందో చూడాలంటున్నారు పార్టీ నేతలు.