సంగారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలతో జగ్గారెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజీనామా, కొత్త పార్టీ అనే చర్చ ఈ రోజు లేదని… మీ అందరి ఆలోచన ఏంటో తనకు తెలుసు అని జగ్గారెడ్డి వ్యాఖ్యానించారు. తనకు టీఆర్ఎస్‌లోకి వెళ్లే ఉద్దేశం లేదని.. బీజేపీలోకి వెళ్లే మాటే లేదని స్పష్టం చేశారు. ఇండిపెండెంట్‌గా ఉండాలని భావిస్తున్నట్లు పార్టీ కార్యకర్తలతో ఆయన అన్నారు. ఒకవేళ కొత్త పార్టీ పెడితే తనతో ఎంతమంది వస్తారని ఆయన అడిగారు.…