‘మేజర్’ సినిమా పాన్ ఇండియా రేంజులో హిట్ కావడంతో అడవి శేష్ మంచి ఊపులో ఉన్నాడు. ఇదే జోష్ లో ‘హిట్ 2’ సినిమాని డిసెంబర్ 2 ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శేష్ సిద్దమయ్యాడు. నాని ప్రెజెంట్ చేస్తున్న ‘హిట్ 2’ మూవీ ‘హిట్’ ఫ్రాంచైజ్ లో భాగంగా తెరకెక్కిన రెండో సినిమా. శైలేష్ కొలను డైరెక్ట్ చేసిన ఈ మూవీ ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ అయ్యి, సినిమాపై అంచనాలని పెంచింది. థ్రిల్లర్ సినిమాలు అడవి శేష్ నుంచి వస్తున్నాయి అంటే ఆడియన్స్ లో మంచి అంచనాలు ఉంటాయి ఆ అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా ఉండేలా రూపొందిన ‘హిట్ 2′ ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ ని క్యారీ చేస్తోంది. హిట్ 2 రిలీజ్ కి ఇంకో వారం మాత్రమే సమయం ఉండడంతో శేష్, బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా శేష్ మీడియాతో మాట్లాడుతూ… “హిట్ 2 సినిమాని హిందీలో రిలీజ్ చేయమని చాలా మంది అడుగుతున్నారు, హిట్ 2ని కేవలం తెలుగు వరకే అనుకోని రుపొందించాం. ఇప్పుడు అందరూ ఫోన్ చేసి హిందీలో కూడా రిలీజ్ చేయమని అడుగుతున్నారు కాబట్టి నానితో మాట్లాడి నిర్ణయం తీసుకోవాలి. ఏది చేసినా గట్టిగా చేయాలి అంటే ఈసారి పెద్దగా చేస్తాం’ అంటూ చెప్పుకొచ్చాడు.
అడవి శేష్ మాటలతో ‘హిట్ 2’ పాన్ ఇండియా రిలీజ్ అనే టాపిక్ బయటకి వచ్చింది. హిట్ పార్ట్ 1 హిందీలో తెరకెక్కింది కానీ అక్కడ ఆశించిన రిజల్ట్ రాలేదు. ఈ నేపధ్యంలో ‘హిట్ 2’ రీమేక్ చేయడం కన్నా డబ్ చేసి రిలీజ్ చేయడం అనేది మంచి ఆలోచనే పైగా ‘హిట్’ని 7 లేదా 8 భాగాలుగా ప్లాన్ చేస్తున్నారు కాబట్టి ఇతర భాషల్లో రీమేక్ చేయడం కన్నా అన్ని భాషల్లో డబ్ చేసి విడుదల చేస్తే మంచి రీచ్ వచ్చే ఛాన్స్ ఉంది. అడవి శేష్ కి ‘మేజర్’ రూపంలో పాన్ ఇండియా గుర్తింపు ఉంది కాబట్టి, ఈ ఫ్రాంచైజ్ కి అతని ఇమేజ్ కూడా హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరి ‘హిట్’ సీరిస్ ని హీరో నాని పాన్ ఇండియా స్థాయిలోకి తీసుకోని వెళ్తాడో లేదో చూడాలి.