Gudivada Amarnath: పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భార్యాభర్తల్లా తిరుగుతున్నారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath: విశాఖలో ఈనెల 15న పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్న నేపథ్యంలో అధికార వైసీపీ, జనసేన నేతల మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటోంది. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై మంత్రి గుడివాడ అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు చీరలు, గాజులు పెట్టి పంపిస్తామన్న జనసేన నేతల వ్యాఖ్యలపై మంత్రి అమర్నాథ్ స్పందిస్తూ.. పవన్ కళ్యాణ్ దగ్గర చీరలు, గాజులు బోలెడన్నీ మిగిలిపోయాయని.. అందుకే వాటిని ఏం చేయాలో తెలియడం లేదని చురకలు అంటించారు. పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్ భార్యాభర్తలు తరహాలో తిరుగుతున్నారని.. వైసీపీ నేతలకు చీరలు ఇచ్చే బదులు భార్యాభర్తలుగా కలిసి తిరుగుతున్నందున ముందుగా మనోహర్‌కు చీర కడితే బాగుంటుందని తమ అభిప్రాయంగా మంత్రి గుడివాడ అమర్నాథ్ సెటైర్లు వేశారు.
తాము చేపట్టిన విశాఖ గర్జన కార్యక్రమం ఫెయిల్ చేసేందుకే ఈనెల 15న పవన్ కళ్యాణ్ జనవాణి కార్యక్రమాన్ని పెట్టుకున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రేపు నాన్ పొలిటికల్ జేఏసీ ఇచ్చిన విశాఖ గర్జనకు వైసీపీ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు. విశాఖ గర్జన ర్యాలీలో లక్షలాది మంది పాల్గొంటారని ఇంటలిజెన్స్ రిపోర్ట్ ఉందన్నారు. వెనుకబడిన ఉత్తరాంధ్రకు రాజధాని కావాలని ప్రజలు కోరుకుంటున్నట్లు మంత్రి అమర్నాథ్ స్పష్టం చేశారు.
Also Read
మరోవైపు మంత్రి విడదల రజినీ కూడా విశాఖ గర్జనపై స్పందించారు. ఎండొచ్చినా, వానొచ్చినా విశాఖ గర్జన విజయవంతం కావడం ఖాయమని ఆమె అభిప్రాయపడ్డారు. చంద్రబాబు అండ్ కో ఎన్ని కుట్రలు చేసినా పరిపాలన వికేంద్రీకరణను ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి విడదల రజినీ స్పష్టం చేశారు. అభివృద్ధి జరిగితే రాజకీయ ఉనికి కోల్పోతారని చంద్రబాబు భయపడుతున్నారని చురకలు అంటించారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కాంక్షించే ప్రజలందరూ సీఎం జగన్ మోహన్ రెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారని ఆమె తెలిపారు.
తాజావార్తలు
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?
-
Donald Trump: అమెరికా అధ్యక్షుడి రహస్య ప్రయాణం.. అసలు కారణం ఇదే!
-
Fauji vs Eta: ప్రభాస్ ‘ఫౌజీ’కి బిగ్ టెన్షన్.. హిందీ బెల్ట్‌లో గట్టి పోటీ!
-
BCCI: బీసీసీఐపై వీవీఎస్ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు.. షాక్‌లో మాజీ క్రికెటర్!
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..