వరల్డ్ బిగ్గెస్ట్ విజువల్ వండర్ గా డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్త సినీ అభిమానుల ముందుకి వచ్చిన సినిమా ‘అవతార్ 2’. జేమ్స్ కామరూన్ డైరెక్ట్ చేసిన ఈ ఎపిక్ మూవీ వరల్డ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తూనే ఉంది. నిజానికి అనుకున్న టాక్ అండ్ హైప్ రెండూ రాకపోవడంతో అవతార్ 2 సినిమా ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో? ఎంతవరకూ రాబడుతుందో అనే ఆందోళన అందరిలోనూ నేలకొంది. అయితే ఎప్పటిలాగే జేమ్స్ కామరూన్ స్లో అండ్ స్టడీగా లాంగ్ రన్ ఆడుతుంది అని ప్రూవ్ చేస్తూ అవతార్ 2 మూవీ బాక్సాఫీస్ దగ్గర వండర్స్ క్రియేట్ చేస్తోంది. 2022 హైయెస్ట్ గ్రాసర్ అయిన టాప్ గన్ మెవరిక్ సినిమా కలెక్షన్స్ ని బ్రేక్ చేసిన అవతార్ 2, ఓవరాల్ గా ‘అవెంజర్స్’ సినిమా కలెక్షన్స్ ని క్రాస్ చేసింది. ఇప్పటివరకూ 1.54 బిలియన్ డాలర్స్ ని రాబట్టిన అవతార్ 2 సినిమా ప్రపంచంలోనే అత్యధిక కలెక్షన్స్ ని రాబట్టిన చిత్రాల జాబితాలో 9వ స్థానంలో ఉంది.
Read Also: Avatar 2: ఈ హాలీవుడ్ సినిమాని వంద కోట్ల మార్క్ టచ్ చెయ్యనివ్వని హీరో ఎవరో తెలుసా…
అవతార్ 2 మూవీ బ్రేక్ ఈవెన్ మార్క్ రీచ్ అయ్యిందని జేమ్స్ కామరూన్ స్వయంగా తెలియజేసాడు. దీంతో ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న అవతార్ 3 సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ని మొదలుపెట్టనున్నట్లు జేమ్స్ కామరూన్ చెప్పాడు. అవతార్ 4లో ఇప్పటికే కొంతభాగం షూటింగ్ కంప్లీట్ అవ్వగా, పార్ట్ 5 స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ అయ్యిందని జేమ్స్ కామరూన్ అప్డేట్ ఇచ్చాడు. అవతార్ 2 సినిమా బ్రేక్ ఈవెన్ కాకపోతే సీక్వెల్స్ చెయ్యను అని చెప్పిన జేమ్స్ కామరూన్ ఇప్పుడు పార్ట్ 4, పార్ట్ 5ల గురించి మాట్లాడుతూ ఉండడంతో అవతార్ ఫ్రాంచైజ్ అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక వరల్డ్ వైడ్ హైయెస్ట్ కలెక్షన్స్ సినిమాల లిస్ట్ విషయానికి వస్తే మొదటి స్థానంలో 2.9 బిలియన్ డాలర్స్ తో అవతార్ పార్ట్ 1 ఫస్ట్ ప్లేస్ లో ఉండగా, అవెంజర్స్ – ఎండ్ గేమ్ సినిమా 2.7 బిలియన్ డాలర్స్ తో సెకండ్ ప్లేస్ లో ఉంది. టైటానిక్ మూవీ అప్పట్లోనే 2.1 బిలియన్ డాలర్స్ ని రాబట్టి మూడో స్థానంలో ఉంది. టాప్ 3 వరల్డ్స్ హైయెస్ట్ గ్రాసర్స్ లో జేమ్స్ కామరూన్ డైరెక్ట్ చేసిన సినిమాలే రెండు ఉండడం విశేషం.