Gadikota Srikanth Reddy: ‘ఫాల్స్ ప్రచారం చేస్తున్నారు’.. సీఎంపై గడికోట శ్రీకాంత్ రెడ్డి ఫైర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gadikota Srikanth Reddy: కూటమి సర్కార్, సీఎం చంద్రబాబు నాయుడపై వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వయస్సు పెరిగినా తన రాజకీయ ధోరణిలో మార్పు రాలేదని, ఏ సభకు వెళ్లినా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేయడానికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని ఆరోపించారు. చంద్రబాబు డబుల్ స్టాండర్డ్స్ మార్చుకోవాలని సూచించారు. విదేశాల నుంచి భారీ పెట్టుబడులు వస్తున్నాయని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని, ఇప్పటివరకు రాష్ట్రానికి రూ.6,900 కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని పేర్కొన్నారు. ప్రకటించిన 10 పరిశ్రమల్లో కేవలం రెండు మాత్రమే పురోగతిలో ఉన్నాయని, వాటి ద్వారా సుమారు 25 వేల ఉద్యోగాలే వచ్చే అవకాశం ఉందని అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వ హయాంలో పరిశ్రమలు పారిపోయాయని చేసిన ప్రచారం అవాస్తవమని గడికోట శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వైసీపీ ప్రభుత్వం నంబర్ వన్ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం రాష్ట్రం ఎనిమిదో స్థానానికి పడిపోయిందని చెప్పారు. గతంలో తయారీ రంగంలో దక్షిణ భారతదేశంలో అగ్రస్థానంలో ఉన్నామని, తాము ఆధారాలతోనే మాట్లాడుతున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిన్న, మధ్య, భారీ పరిశ్రమలు అనేకం మూతపడ్డాయని, జీఎస్టీ ఆదాయాల్లో కూడా రాష్ట్రం తన స్థానం కోల్పోయిందని ఆరోపించారు. రూ.61 వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఉన్న రాష్ట్రం దేశంలో మరొకటి ఉండదన్నారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా గత ప్రభుత్వం ఐదేళ్లలో రూ.3.32 లక్షల కోట్ల అప్పులతో సంక్షేమ పథకాలు అమలు చేసిందని, ప్రస్తుతం ప్రభుత్వం రెండేళ్లలోనే రూ.3.5 లక్షల కోట్ల అప్పులు చేసిందని విమర్శించారు. అలాగే 95 శాతం పూర్తయిన రామాయపట్నం పోర్టును ప్రైవేటీకరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని కూడా ఆరోపించారు వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి..
Also Read
- AP Government: కేఆర్ఎంబీకి ఏపీ కీలక లేఖ.. శ్రీశైలం నీటి వినియోగంపై అభ్యంతరం
- Amaravati - Krishna River: అమరావతికి గుడ్‌న్యూస్.. కృష్ణా నది కరకట్ట పనులకు గ్రీన్ సిగ్నల్
- AP Government: ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. EHSపై ప్రభుత్వం కీలక నిర్ణయం
- Minister Dola Veeranjaneya Swamy : చలో విజయవాడపై మంత్రి డోలా ఫైర్.. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ఇచ్చాం.. అయినా ఆందోళన ఎందుకు?
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!