Andhra Pradesh: మాజీ హోంమంత్రి, ప్రత్తిపాడు ఎమ్మెల్యే మేకతోటి సుచరిత డ్రైవర్ ఏఆర్ కానిస్టేబుల్ పూజల చెన్నకేశవులు(45) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గుంటూరు బ్రాడీపేటలోని సుచరిత ఇంటి సమీపంలోనే ఓ బిల్డింగ్‌లో గది అద్దెకు తీసుకుని గన్‌మెన్లు విశ్రాంతి తీసుకుంటుంటారు. సోమవారం రాత్రి సుచరిత సెక్యూరిటీ అధికారి రామయ్యతో కలిసి చెన్నకేశవులు విశ్రాంతి గదికి వచ్చాడు. రామయ్య స్నానం చేసేందుకు తన 9 ఎంఎం పిస్టల్‌ను బయట ఉంచి బాత్‌రూంలోకి వెళ్లాడు. దీంతో చెన్నకేశవులు ఆ తుపాకీ తీసుకుని…