మాస్ మహారాజ్ రవితేజకి బిగ్గెస్ట్ కంబ్యాక్ హిట్ గా నిలిచిన క్రాక్ మూవీ రికర్డులనే బ్రేక్ చేసిన సినిమా ‘ధమాకా’. రవితేజలోని కామెడీ టైమింగ్ ని పర్ఫెక్ట్ గా చూపించిన ఈ మూవీ, రవితేజ కెరీర్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. 100 కోట్లు రాబట్టిన ధమాకా సినిమా, రవితేజ కెరీర్ లోనే హైయెస్ట్ గ్రాసర్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. ఈ మూవీ అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం రవితేజ్ ఎనర్జీ, శ్రీలీలా గ్లామర్, ప్రసన్న కుమార్ బెజవాడ డైలాగ్స్. రవితేజ వన్ మ్యాన్ షో చేసిన ధమాకా మూవీ హిట్ క్రెడిట్ అందరికన్నా ఎక్కువగా ఇవ్వాల్సిందే మ్యూజిక్ డైరెక్టర్ ‘భీమ్స్ సిసిరీలియో’కే. రవితేజ అభిమానులకి కూడా ఎలాంటి అంచనాలు లేని ధమాకా మూవీని రిలీజ్ కన్నా ముందు ఆడియన్స్ దృష్టిలో పడేలా చేశాడు భీమ్స్. ధమాకా సినిమాలోని ప్రతి పాట సూపర్ హిట్ అయ్యింది ‘టైటిల్ సాంగ్’, ‘జింతాక జింతాక’, ‘దండ కడియాల్’, ‘వాట్స్ హ్యపెనింగ్’ సాంగ్స్ తెలుగు రాష్ట్రాల్లో రీసౌండ్ వచ్చే రేంజులో వినిపించాయి.
ధమాకా సినిమాలో కూడా ఈ సాంగ్స్ సూపర్బ్ గా ప్లేస్ అవ్వడం, లీడ్ పెయిర్ డాన్స్ ఇరగదీయడంతో పాటలు వస్తున్న సమయంలో థియేటర్ లో ఆడియన్స్ కుర్చీలో కూర్చోకుండా డాన్స్ చేశారు. ఇక ధమాకా సినిమాని పీక్ స్టేజ్ కి తీసుకోని వెళ్లింది, క్లైమాక్స్ లో వచ్చే ‘పల్సర్ బైక్ సాంగ్’. ధమాకా మూవీ కన్నా ముందు యుట్యూబ్ లో సూపర్ హిట్ అయిన ఈ పల్సర్ బైక్ సాంగ్ ని, ధమాకా సినిమా క్లైమాక్స్ లో పెట్టడం రవితేజ, శ్రీలీల డాన్స్ తో దుమ్ము లేపడంతో ఆడిటోరియం ఒక్కసారిగా హై వోల్టేజ్ ఎనర్జీతో ఊగిపోయింది. ధమాకా సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి ‘పల్సర్ బైక్’ సాంగ్ కూడా కారణమే. ఈ వీడియో సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. రవితేజ, శ్రీలీల సూపర్బ్ డాన్స్ ని చూసి ఎంజాయ్ చెయ్యండి.