ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్ కాంగ్రెస్ పార్టీకి వరుసగా గుడ్‌బై చెబుతున్నారు మాజీ ఎమ్మెల్యే.. మొన్నటికి మొన్న మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావు వైసీపీకి రాజీనామా చేయగా.. రేపు పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు.. మరోవైపు.. జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు బీసీ సదస్సు నిర్వహించారు.. అయితే, ఆ సదస్సులో పాల్గొన్నారు మంగళగిరి మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల.. ఉన్నట్టుండి ఆమె జనసేన సమావేశానికి రావడం చర్చగా మారింది.. త్వరలోనే కాండ్రు కమల జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది..
Read Also: Pawan Kalyan: జనసేన గూటికి ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు..! రేపు పవన్ సమక్షంలో చేరిక
ఇక, ఈ సందర్భంగా హాట్ కామెంట్లు చేశారు కమల.. పార్టీలన్నీ బీసీల ఓట్లు కావాలంటున్నాయి.. కానీ, ఎమ్మెల్యే సీట్ల వరకు వచ్చేసరికి వెన్ను చూపిస్తున్నాయని మండిపడ్డారు. బీసీలు బలంగా ఉన్న మంగళగిరి లాంటి చోట్ల కూడా ఓసీలే పోటీ చేస్తున్నారని విమర్శించారు. నిధులు విధులు లేని స్థానిక సంస్థల్లో బీసీలకు, మహిళలకు పదవులు ఇచ్చేసి.. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చామని గొప్పులు చెబుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కాండ్రు కమల. కాగా, మంగళగిరిలో బలంగా వున్న పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన కాండ్రు కమల.. కాంగ్రెస్ నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. మంగళగిరి మున్సిపల్ ఛైర్మన్‌గా, ఎమ్మెల్యేగా పనిచేశారు. ఏపీ విభజన తర్వాత కొంత కాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. ఆ తర్వాత టీడీపీలో చేరి టికెట్ ఆశించారు. అయితే అధిష్టానం మంగళగిరి సీటును నారా లోకేష్‌కు కేటాయించడంతో.. ఆ తర్వాత 2019 ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. కానీ, ఇప్పుడు జనసేన బీసీ సదస్సుకు హాజరుకావడం.. బీసీలకు జరుగుతోన్న అన్యాయంపై గొంతు ఎత్తడం చర్చగా మారింది.