ఆమెని ఎలాగైనా సరే…. నియోజకవర్గం నుంచి పంపేయాలని ఆ పెద్దాయన, ఉఫ్‌మని ఊదేస్తే కొట్టుకుపోవడానికి నేనేమన్నా ఎండుటాకునా? టిష్యూ పేపర్‌నా..? శివంగిని… అంటూ ఆమె మేటర్‌ని మాంఛి రక్తి కట్టిస్తున్నారు. వైసీపీ కేడర్ కూడా ఇద్దరి మధ్య సేఫ్ గేమ్ ఆడుతూ తూనికలు-కొలతలు వేస్తోందట. ఏ నియోజకవర్గంలో ఉందా ఢీ అంటే ఢీ అనే పరిస్థితి? ఎవరా ఇద్దరు నేతలు? Also Read:GOAT Teaser: నవ్వులు పంచేలా.. సుడిగాలి సుధీర్ GOAT టీజర్.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు…
Traffic Restrictions in Srisailam and Kurnool District: శ్రీశైలం వెళ్తున్నారా? అయితే, ఇది మీ కోసమే.. ఎందుకంటే శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి.. తాత్కాలికంగా పూర్తిగా ట్రాఫిక్ నిలిపివేయనున్నారు.. ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్‌లో పర్యటించనున్నారు.. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఆయన పర్యటన కొనసాగనుంది.. మొదట శ్రీశైలం మల్లికార్జున స్వామి, భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకోనున్నారు ప్రధాని.. అయితే, 16వ తేదీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు శ్రీశైలంలో ట్రాఫిక్ ఆంక్షలు…
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది..
కర్నూలు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో.. విహారయాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న ముగ్గురు మృతిచెందారు.. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ వద్దనున్న కాశిరెడ్డినాయన ఆశ్రమం వద్ద ఈ రోజు రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను స్కార్పియో వాహనం వెనుక వైపు నుంచి ఢీకొట్టింది.. ఈ ప్రమాదంలో కమల్ భాష (50), మున్నా (35), షేక్ నదీయా (3) మృతిచెందగా.. మరో ఆరుగురుకు తీవ్రగాయాలు అయ్యాయి.
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర నది ఉధృతంగా ప్రవహిస్తోంది... దీంతో పెద్ద ఎత్తున వచ్చి ఇన్‌ఫ్లో రూపంలో తుంగభద్ర డ్యామ్‌లోకి వచ్చి చేరుతుంది.. అధిక ప్రమాణంలో జలాశయంలోకి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు నిండుకుండలా మారింది.
కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం మీది వేముల వద్ద వైసీపీ మాజీ ఎంపీటీసీ రమేష్ ను దారుణంగా హత్య చేశారు. దుండగులు బండ రాయితో తలపై కొట్టి చంపారు. కర్నూలు నుంచి బైక్ పై సొంతూరు మీదివేములకు వెళ్తుండగా కాపుకాచి హత్య చేశారు. హత్యకు రాజకీయపరమైన కారణాల, వ్యక్తిగత కారణాల అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
కర్నూలు జిల్లా కోసిగిలో పెళ్లి బృందంపై వైసీపీ రౌడీ మూకలు దాడికి పాల్పడినట్టు చెబుతున్నారు.. ఏకంగా టీడీపీ సానుభూతిపరుల పెళ్లి ఊరేగింపులో.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడి చేశారు. ఈ దాడిలో పలువురికి గాయాలు అయ్యాయి. మహిళలు మెడలో ఉన్న బంగారం, వెండి ఆభరణాలు వైసీపీ శ్రేణులు లాగేసుకున్నారని ఆరోపణలు చేస్తున్నారు..
Child Abuse: కర్నూలు జిల్లా కౌతాళం మండలం వల్లూరు గ్రామంలో మానవత్వాన్ని కలచివేసే ఘటన చోటు చేసుకుంది. స్వీట్స్ ఇస్తానని చెప్పి ఒక యువకుడు ఆరేళ్ల చిన్నారి పై లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ అమానుష ఘటనతో గ్రామంలో తీవ్ర ఆందోళన నెలకొంది. పోలీసుల తెలిపిన కథనం ప్రకారం.. రంగస్వామి అనే యువకుడు ఆరేళ్ల బాలికను మోసం చేసి స్వీట్స్ కొనిస్తానని తీసుకెళ్లి దారుణంగా లైంగిక దాడి చేశాడు. అయితే తల్లి తండ్రులు సరిగ్గా ఆ సమయంలో అక్కడికి…
హైస్కూల్ గ్రౌండ్‌లో విద్యార్థులు అంతా సరదాగా క్రికెట్ ఆడుతుండగా.. జరిగిన ఓ ఘటన ఇద్దరు విద్యార్థుల ప్రాణాలు తీసింది.. కర్నూలు జిల్లాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కౌతాళం మండలం కాత్రికిలో పిడుగు పడి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు..
ప్రతీ చర్యకు.. ప్రతిచర్య ఉంటుంది అంటూ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడతాడే, అంతే వేగంతో అదిపైకి లేస్తుందన్నారు.. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారని.. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారని హెచ్చరించారు..