CPI Ramakrishna: పవన్ కల్యాణ్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలి
- డిప్యూటీ సీఎం పవన్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని సందర్శించాలి..
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సూచన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CPI Ramakrishna: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కప్పట్రాళ్ల ప్రాంతాన్ని కూడా సందర్శించాలని సూచించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.. కర్నూలులో మీడియాతో మాట్లాడిన ఆయన.. కప్పట్రాళ్ల వద్ద యురేనియం కోసం 11 ఎకరాల్లో 68 బోర్లు వేయడానికి సిద్ధం చేస్తున్నారు.. పులివెందుల, ఆళ్లగడ్డలో యురేనియంపై టీడీపీ, సీపీఐ కలసి వ్యతిరేకించాం.. కానీ, అధికారంలోకి వచ్చాక ఇప్పుడు యురేనియం తవ్వకలుచేస్తే ఎలా? అని ప్రశ్నించారు.. అందుకే ఈ ప్రాంతాన్ని పవన్ పరిశీలించాలని సలహా ఇచ్చారు.. ఇక, బెదిరింపుల ద్వారా యురేనియం కి వ్యతిరేకంగా ఆందోళనలు ఆపాలని ప్రయత్నిస్తే ఉద్యమాలు ఆగవు అని హెచ్చరించారు రామకృష్ణ.
Read Also: NBK 109 : బాలయ్య సినిమాకి కొత్త తలనొప్పి.. 5 కోట్ల నష్టం?
Also Read
- MA Ghaffoor’s Son Kiran Dies in US: అమెరికాలో తెలుగు సైంటిస్ట్ కన్నుమూత.. సీపీఎం మాజీ ఎమ్మెల్యే గఫూర్ ఇంట తీవ్ర విషాదం..
- Silver Jubilee Fraternity Meet: కర్నూలు సిల్వర్ జూబ్లీ కాలేజీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా వెంకయ్య
- Minister TG Bharath: కర్నూలులో జాబ్ మేళా ప్రారంభం.. యువతకు ఉద్యోగాలు.. కర్నూలుకు భారీ పెట్టుబడులు..!
- Pothireddypadu : పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద భారీ ప్రమాదం.. తెగిపడిన 9వ గేటు
కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచి ప్రజాలపై భారం మోపుతుంది.. పెద్ద కంపెనీలకు దోచి పెట్టడానికి విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నారు.. ఎన్నికల ముందు విద్యుత్ చార్జీలు పెంచబోమని చెప్పారు అని గుర్తుచేశారు రామకృష్ణ.. విజయవాడలో 7న వమాపక్షపార్టీల సమావేశం నిర్వహిస్తున్నాం.. కలసి వచ్చే పార్టీలతో ఆందోళన చేస్తాం…ప్రభుత్వాన్ని నిలదీస్తాం అన్నారు. శాంతిభద్రతలు ప్రభుత్వం ఫెయిల్యూర్ అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా అంగీకరించారు.. మూడేళ్ల బాలికపై కూడా అత్యాచారం చేస్తున్నారు.. హోం మంత్రి బాధ్యత తీసుకోవాలని పవన్ అంటున్నారు.. హోం మంత్రి అనిత చెప్పడం విడ్డూరం.. గత ప్రభుత్వ నిర్వాకమే అత్యాచారాలు అని హోం మంత్రి చెప్పారని దుయ్యబట్టారు.. నిర్వీర్యమైన పోలీస్ వ్యవస్థను పట్టాలెక్కించడానికి కూటమి ప్రభుత్వం ఏంచేసింది? అని ప్రశ్నించారు. డీఎస్పీ, సీఐ, ఎస్ఐలపోస్టింగ్ కి లక్షలు వసూలు చేస్తున్నారు.. గోదావరి జిల్లాలో సీఐ పోస్టింగ్ కి 50 లక్షలు తీసుకున్నారట అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. 26 జిల్లాలో ఎవరు ఎంత వసూలు చేశారో నివేదిక తెప్పించుకోండి.. గోదావరి జిల్లాల్లో ఎక్కువగా పోస్టింగ్ కి వసూలు చేశారు.. జగన్ ఒక రకంగా నిర్వీర్యం చేస్తే మీరు మరో రకంగా నిర్వీర్యం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ.
తాజావార్తలు
-
PM Modi Navratri Wishes 2026: దేశ ప్రజలకు నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ.. మాత శైలపుత్రిపై ఏమన్నారంటే?
-
Secunderabad: రూ. 20 లక్షల కోసం చిన్నారిని కిడ్నాప్ చేసిన సెక్యూరిటీ గార్డ్.. వాటర్ సంప్‌లో మృతదేహం..
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Hardik Pandya Birthday: మ్యాగీ తిని బతికిన రోజుల నుంచి కోట్ల సంపద వరకు.. హార్దిక్ పాండ్యా సక్సెస్ స్టోరీ!
-
Apple Halwa Recipe: నవరాత్రుల వేళ అమ్మవారికి స్పెషల్ నైవేద్యం.. తక్కువ టైమ్‌లో నోరూరించే యాపిల్ హల్వా ట్రై చేయండి!
ట్రెండింగ్
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!
-
IND vs WI 3rd T20: సిరీస్‌పై పట్టు కోసం భారత్-విండీస్ పోరు.. టీమిండియా ప్లేయింగ్ XI ఇదే..
-
Sunday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.! నేటి రాశిఫలాలు ఇలా..