Balloon Gas Cylinder Blast : మియాపూర్‌లో బెలూన్ గ్యాస్ సిలిండర్ పేలుడు.. నలుగురికి గాయాలు
- GSM మాల్ ఎదుట ఒక్కసారిగా పేలిన సిలిండర్
- 16 ఏళ్ల విద్యార్థినితో పాటు నలుగురికి గాయాలు
- బెలూన్లు నింపుతుండగా ప్రమాదం.. తీవ్ర కలకలం
- వ్యాపారి జయరామ్‌పై కేసు నమోదు చేసిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balloon Gas Cylinder Blast: హైదరాబాద్‌లోని మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం సాయంత్రం వేళ తీవ్ర దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. స్థానిక జీఎస్ఎం (GSM) మాల్ ఎదురుగా ఉన్న సర్వీస్ రోడ్డుపై వ్యాపారి బెలూన్లలో గ్యాస్ నింపుతుండగా, సిలిండర్ ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ప్రమాదం తీవ్ర కలకలం సృష్టించగా, ఘటనా స్థలంలో ఉన్న నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. బాధితుల్లో ఐస్‌క్రీమ్ వ్యాపారి వివేక్ పాల్ (19)కు తీవ్ర గాయాలు కాగా, శ్రీ చైతన్య కళాశాల విద్యార్థిని నంద్యాల ధనుష (16), ఐటీ ఉద్యోగిని విన్నకోట సింధు ప్రియా (25) , ముళ్లగాని జనార్ధన్లకు స్వల్ప గాయాలయ్యాయి.
రంగంలోకి దిగిన పోలీసులు.. వ్యాపారిపై కేసు నమోదు
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మియాపూర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. బెలూన్లలో గ్యాస్ నింపే సిలిండర్‌ను సరైన భద్రతా ప్రమాణాలు పాటించకుండా, అత్యంత నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్లే ఈ పేలుడు సంభవించినట్లు పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన బెలూన్ వ్యాపారి జయరామ్‌పై పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపడుతున్నారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
తాజావార్తలు
-
Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Danish Kaneria: “పోలీసులు టాస్ గెలిస్తే బ్యాటింగ్ ఎంచుకోవాలి”.. సీజేపీ నిరసనలపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సంచలన పోస్ట్..
-
Tollywood Movie Releases: కుర్రళ్లోయ్.. కుర్రాళ్లు..! బాక్సాఫీస్ వద్ద యంగ్ హీరోల దండయాత్ర..
-
Alias Rukmini Heroine: ‘అలియాస్ రుక్మిణీ’.. టైటిల్ రోల్ పోషించేది ఈమేనా?
ట్రెండింగ్
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!