కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. మద్దికేర మండలం ఎం అగ్రహారంలో భర్తను దారుణంగా హత్య చేసింది ఓ మహిళ. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంకటేష్ అనే వ్యక్తిని భార్య సరస్వతి మూడు రోజుల క్రితం హత్య చేసింది.. ఆ తర్వాత ఇంట్లోనే మృతదేహాన్ని ఉంచింది.. అక్కడి నుంచి పరారైంది..
కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరులో ఏటీఎం మిషన్‌ను ఎత్తుకెళ్లేందుకు దొంగలు విఫలయత్నం చేశారు. బ్యాంక్ ఆఫ్ బరోడా కు చెందిన ఏటీఎంను పెకిలించిన దుండగులు.. టోయింగ్ వాహనంలో తరలిస్తుండగా.. స్థానిక యువకులు గమనించి అడ్డుకున్నారు. కర్నూలులో సినిమా చూసి చిన్నటేకూరుకు వెళ్లగా ఐచర్ వాహనంలో ఏటీఎం తరలిస్తున్న దృశ్యాలు కనిపించాయి.
కర్నూలు జిల్లాలో తల్లీకూతుళ్ల అనుమానాస్పద మృతి కేసులో విస్తుగొలిపే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హోలగుంద మండలం హెబ్బటంలో తల్లి, బిడ్డను హత్య చేసింది భర్తే అని నిర్ధారణకు వచ్చారు స్థానిక పోలీసులు.. భార్య సలీమా(24) , కూతురు సమీరా(4) ను భర్త సక్రప్ప గొంతు నులిమి చంపినట్లుగా విచారణలో తేల్చారు పోలీసులు.. అయితే, బిడ్డను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుందని భర్త సక్రప్ప మొదట ప్రచారం చేసిన విషయం విదితమే..
కర్నూలు జిల్లా కోసిగి మండలం కడదొడ్డిలో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న బాలికపై సర్పంచ్ హుసేనితో పాటు మరో ఇద్దరు అత్యాచార యత్నం చేశారు. బాలిక తాత కేకలు వేయడంతో సర్పంచ్ హుసేని అక్కడి నుంచి పరారయ్యాడు.
కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. ప్రేమోన్మాది చేతిలో బాలిక బలైంది. తనను ప్రేమించాలంటూ గత కొంత కాలంగా ఓ బాలిక వెంట పడుతోన్న యువకుడు.. ఎవరూ లేని సమయం చూసుకొని ఆ ఇంట్లోకి చొరబడ్డాడు.. ప్రేమించాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత బాలికపై అత్యాచారం చేసేందుకు ప్రయత్నించాడు.. బాలిక తీవ్రంగా ప్రతిఘటించడంతో.. బలవంతంగా ఆమె నోట్లు పురుగుల మందు పోసి పరారయ్యాడు..