Kottu Satyanarayana Fires On Chandrababu Naidu: చంద్రబాబు ఆల్ ఫ్రీ బాబు అని.. 2014 ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచాడని మంత్రి కొట్టు సత్యనారాయణ ధ్వజమెత్తారు. మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని.. కానీ చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే మేనిఫెస్టోని డిలీట్ చేయించాడని ఆరోపించారు. పవన్ కూడా ఆంధ్ర రాష్ట్రం మరో శ్రీలంక, పాకిస్తాన్ అవుతుందని.. అప్పులతో రాష్ట్ర ప్రజల్ని జగన్ సోమరిపోతులను చేస్తున్నాడంటూ దిగజారి మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో తాము కాపు నేస్తం ఇస్తామని చెప్పలేదని.. అయినా కాపులకు న్యాయం చేశామని అన్నారు. అందుకు కాపులందరూ ప్రభుత్వంపై సంతృప్తిగా ఉన్నారని తెలిపారు.
Margani Bharath: ఒడిశా రైలు ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలి
హరిరామ జోగయ్య పుస్తకంలో వంగవీటి మోహన్ రంగ హత్య కేసులో ప్రథమ ముద్దాయి ఎవరని రాశారు? ప్రభుత్వ పాలనపై కూడా ఏమి రాస్తాడో రాయనివ్వండని మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. ముందస్తు ఎన్నికలకు తమ ప్రభుత్వం వెళ్లదని స్పష్టం చేశారు. ఈసారి చంద్రబాబు ఎన్ని వేషాలు వేసినా ఎన్నికల్లో గెలవడని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ కేవలం షెడ్యూల్ గ్యాప్‌లో వస్తాడని, ఆ తర్వాత సినిమాలు చేసుకుంటూ హ్యాపీగా ఉంటాడని పేర్కొన్నారు. మూడు రాజధానులను అభివృద్ధి చేయడమే తమ వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని అన్నారు. ముందే అభివృద్ధి చెందిన వైజాగ్‌ని రూ.5 వేల కోట్లతో రాజధానిగా అభివృద్ధి చేయొచ్చని అన్నారు. అమరావతి తాత్కాలికమేనని.. మూడు రాజధానులు అభివృద్ధి చెందితే హైదరాబాద్, ముంబైల తలదన్నెలా ఉంటాయని చెప్పుకొచ్చారు.
Rahul Ramakrishna: రైలు ప్రమాదం.. కామెడీ చేసిన ‘అర్జున్ రెడ్డి’ కమెడియన్
అంతకుముందు కూడా.. చంద్రబాబుకు ‘ఎన్టీఆర్ హంతక’ బిరుదు ఇవ్వాలని మంత్రి కొట్టు సత్యనారాయణ విరుచుకుపడ్డారు. కేవలం ఓట్ల కోసమే చంద్రబాబు మళ్లీ ఎన్టీఆర్ జపం చేస్తున్నారని, ఆయనకు ‘భారతరత్న’’ ఇవ్వాలని దొంగ నాటకాలు ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబు స్వార్థపూరిత రాజకీయాలకు ఇది నిదర్శనమని చెప్పారు. ఎన్టీఆర్ పేరునే నిర్మూలించాలని చంద్రబాబు దుర్మార్గపు ఆలోచన చేసిన విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఇప్పుడు ఎన్నికలొస్తున్నాయి కాబట్టే ఎన్టీఆర్ జపం చేస్తున్నారన్నారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు.. ఏనాడైనా ఎన్టీఆర్‌కు ‘భారతరత్న’ ఇవ్వాలని కోరుతూ తీర్మానం చేశారా? అని ప్రశ్నించారు.