Kodali Nani: లోకేష్ పాదయాత్రతో టీడీపీ అధికారంలోకి వచ్చే సీన్ లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Satires On Nara Lokesh Padayatra: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తాజాగా లోకేష్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ ప్రతిపక్ష హోదాలో ఉండి పాదయాత్రలు చేశారని.. ఏ అర్హతతో లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని ప్రశ్నించారు. లోకేష్ మొదటగా ఎమ్మెల్యేగా గెలవాలని.. ఆ తర్వాత ప్రతిపక్ష నాయకుడిగా ఉండి పాదయాత్ర చేయాలని అభిప్రాయపడ్డారు. 2024 ఎన్నికల్లో టీడీపీకి జీరో సీట్లు వస్తాయని అన్నారు. అప్పుడు లోకేష్, చంద్రబాబును తన్ని బయటకు తరిమి.. ఎన్టీఆర్ వారసులు పార్టీని మళ్లీ హస్తగతం చేసుకుంటారని పేర్కొన్నారు. లోకేష్ పాదయాత్రతో టీడీపీకి ఎలాంటి ఉపయోగం లేదని.. అతని పాదయాత్రతో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చే సీన్ లేదని తేల్చి చెప్పారు.
Sania Mirza: ఓటమితో కెరీర్‌కి ముగింపు పలికిన సానియా మీర్జా
Also Read
- MLA Jagan: 'బెంగళూరును ఏలుతున్నాం' వ్యాఖ్యలపై దుమారం.. ఎమ్మెల్యే జగన్‌పై కన్నడ సంఘాల ఆగ్రహం
- AP Building Rules: ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. బిల్డింగ్ రూల్స్‌లో భారీ మార్పులు.. అమల్లోకి కొత్త నిబంధనలు..
- YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Bhuma Akhila Priya: అహోబిలం అంశంపై స్పందించిన భూమా అఖిలప్రియ.. ‘వాస్తవాలు వెలుగులోకి రావాలి’
అసలు లోకేష్ ఏ ఎన్నికల్లో గెలిచాడని ప్రజల ముందుకు పాదయాత్ర పేరుతో వస్తున్నాడని కొడాలి నాని నిలదీశారు. దొడ్డి దారిలో ఎమ్మెల్యీ, మూడు శాఖల మంత్రుల పదవులు చేపట్టి.. మంగళగిరిలో లోకేష్ చిత్తు చిత్తుగా ఓడిపోయాడని గుర్తు చేసుకున్నారు. టీడీపీలో వారసత్వం కోసమే లోకేష్ పాదయాత్ర చేస్తున్నాడని.. ఆ పార్టీలోని కార్యకర్తలు, నాయకులే అతడ్ని నమ్మడం లేదని చెప్పారు. టీడీపీని హస్తగతం చేసుకోవడానికి, చంద్రబాబు వారసత్వం కోసమే లోకేష్ ఈ పాదయాత్ర చేస్తున్నాడన్నారు. శాసనసభ్యుడిగా ఓడిపోయినా వాడు పాదయాత్ర చేయడమేమిటని ప్రశ్నించారు. ఇటువంటి పుప్పులు ఎన్ని పాదయాత్రలు చేసినా.. వైసీపీని గెలుపు నల్లేరు మీద నడకలాంటిదన్నారు. టీడీపీ ఎన్టీఆర్ రక్తంతో పుట్టిన పార్టీ అని.. ఎన్టీఆర్ వారసులు, సమర్థుల నుండి పార్టీని లాక్కోవడానికే ఈ పాదయాత్ర అని కొడాలి నాని విమర్శించారు.
Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్
అంతకుముందు.. కృష్ణాజిల్లా గుడివాడలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాల్లోనూ టీడీపీపై కొడాలి నాని ధ్వజమెత్తారు. ఎన్టీఆర్ పేరు, ఫోటోలతో అనేకమంది రాజకీయాలు చేస్తున్నారని.. ఎన్టీఆర్ తమకు ఆదర్శమంటూ కొందరు ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. ఎన్టీఆర్ ఆదర్శమైతే, ఆయనకు ఎందుకు వెన్నుపోటు పొడిచారని నిలదీశారు. ఎన్టీఆర్‌ను క్షోభకు గురిచేసిన దొంగలను ఆయన అభిమానులు మట్టి కరిపించారని అన్నారు. ఎన్టీఆర్ పదవిని దొంగలించిన చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, అప్పటి నాయకులు.. ఇప్పటికీ ఎన్టీఆర్ పేరుతో ఓట్లు పొందుతున్నారన్నారు. ఎన్టీఆర్ గొప్పతనాన్ని గుర్తంచుకున్న సీఎం జగన్.. ఓ జిల్లాకు ఆయన పేరు పెట్టారన్నారు.
తాజావార్తలు
-
HMD Asha 305: HMD Asha 305 విడుదల.. 2GB RAM, 16GB స్టోరేజ్, 4Gతో చౌకైన స్మార్ట్‌ఫోన్
-
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
-
Ather Pothole+ Alerts: ఏథర్ స్కూటర్లకు కీలక అప్డేట్.. గుంతలు, స్పీడ్ బంప్లపై ముందే అలర్ట్! ఎలా పనిచేస్తుందంటే?
-
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
-
Rajni – Kamal Haasan : రజనీకాంత్, కమల్ హాసన్‌తో సినిమా అంటే దర్శకులకు తలనొప్పి తప్పదా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: నేను ఏ బౌలర్‌కు భయపడను.. వారే నన్ను చూసి వణికిపోతున్నారు!
-
Health Tips : వర్షాకాలంలో గొంతు నొప్పా? ఈ అల్లం-బెల్లం కషాయం ట్రై చేయండి.!
-
Protein Tips : పనీర్ తింటున్నారా? పచ్చిదా.. వండిందా.. ఏది బెస్ట్.?
-
7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో వచ్చేస్తున్న బడ్జెట్ ఫోన్ OnePlus N6x.!
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!