Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు ఎదురైనా తన వ్యక్తిత్వంతో ముందుకు సాగింది అతని పదేళ్ల సినీ ప్రయాణం. ‘పెళ్లి చూపులు’ విడుదలైన సమయంలో విజయ్ దేవరకొండపై పెద్దగా అంచనాలు లేవు. అప్పటికే ‘ఎవడే సుబ్రమణ్యం’లో ఒక గెస్ట్ రోల్ మాత్రమే చేశాడు. అయితే అతని నటన, కొత్త తరహా కథతో ‘పెళ్లి చూపులు’ మూవీ ఘనవిజయం సాధించింది. అయితే విజయ్ కెరీర్‌ను పూర్తిగా మార్చేసిన సినిమా మాత్రం ‘అర్జున్ రెడ్డి’. ఆ చిత్రంలో ఆయన నటన, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ యువతను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఆ సినిమా తర్వాత విజయ్ పేరు కేవలం టాలీవుడ్‌కే పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగింది.
ఆ తర్వాత వచ్చిన ‘గీత గోవిందం’ విజయ్‌లోని మరో కోణాన్ని చూపించింది. ఫ్యామిలీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకునే రొమాంటిక్ హీరోగా గుర్తింపు తీసుకొచ్చింది. అనంతరం ‘టాక్సీవాలా’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్’, ‘కింగ్డమ్’ వంటి సినిమాలు అంచనాలను అందుకోకపోయినా, ప్రతి కొత్త సినిమా ప్రకటనతో సోషల్ మీడియాలో భారీ హైప్ రావడం మాత్రం విజయ్ స్టార్డమ్కు నిదర్శనం. విజయ్ దేవరకొండ ప్రత్యేకత కేవలం సినిమాల్లోనే కాదు. యువతతో అతనికి ఏర్పడిన అనుబంధం కూడా అతని బలమే. సినిమా ఫస్ట్ లుక్ విడుదలైనా, కొత్త ప్రాజెక్ట్ ప్రకటించినా, ఇంటర్వ్యూ ఇచ్చినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవడం అతనికి సాధారణ విషయంగా మారిపోయింది. కెరీర్లో కొన్ని ఎదురుదెబ్బలు ఎదురైనా, అభిమానుల్లో అతనిపై ఉన్న ఆసక్తి ఏమాత్రం తగ్గకపోవడం కూడా అదే విషయాన్ని చెబుతోంది.
Also Read
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
- Ilaiyaraaja : ఇళయరాజాకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
నటనతో పాటు వ్యాపార రంగంలో కూడా విజయ్ తన ముద్ర వేస్తున్నారు. ‘రౌడీ వేర్’ పేరుతో ఫ్యాషన్ బ్రాండ్‌ను ప్రారంభించి యువతలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు ‘ది దేవరకొండ ఫౌండేషన్’ ద్వారా విద్యార్థులు, అవసరమైన సహాయం చేస్తూ సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తున్నారు. స్టార్‌డమ్‌ను కేవలం వ్యక్తిగత విజయానికి మాత్రమే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడేలా మార్చేందుకు ఆయన చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. ఇక కెరీర్ పరంగా చూస్తే విజయ్ దేవరకొండకు ముందు ముందు మరింత కీలకమైన దశ ప్రారంభం కానుంది. ఇప్పటికే ‘రౌడీ జనార్దన్’, ‘రణబాలి’ వంటి ప్రతిష్టాత్మక చిత్రాలు లైన్లో ఉండగా, మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా రూపుదిద్దుకుంటోంది. ఈ సినిమాలపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.
సోలో హీరోగా పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ, ఒక నటుడిగా మాత్రమే కాదు, కొత్త తరానికి ప్రతీకగా కూడా నిలిచారు. భిన్నంగా ఆలోచించడం, తనదైన శైలిలో ముందుకు సాగడం, అభిమానులతో నేరుగా కనెక్ట్ కావడం వంటి లక్షణాలు ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి. రాబోయే రోజుల్లో ఈ స్టార్ మరిన్ని విజయాలతో తన ప్రయాణాన్ని తీసుకెళ్తారనే నమ్మకం అభిమానుల్లో అయితే బలంగా కనిపిస్తోంది.
- Tags
- cinema
- Vijay Deverakonda
తాజావార్తలు
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
-
KTR : రేవంత్ ఒక నిజాయితీ గల మోసగాడు.. ప్రశ్నిస్తున్నామని ఆయనకు కోపం
-
The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
-
Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?