Sania Mirza Says Goodbye to Grand Slams Journey After Australian Open Finals: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా ఓటమితో తన కెరీర్‌కి ముగింపు పలికింది. ఆస్ట్రేలియా ఓపెన్-2023 మిక్స్‌డ్ డబుల్‌లో టైటిల్ నెగ్గి కెరీర్‌కి గుడ్‌బై చెప్పాలనుకున్న ఆమె డ్రీమ్ చెదిరిపోయింది. ఈ సందర్భంగా సానియా భావోద్వేగానికి లోనయ్యింది. ‘‘2005లో 18 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు నా ప్రొఫెషనల్ కెరీర్ ఇక్కడే, మెల్‌బోర్న్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు ఇక్కడే నా గ్రాండ్‌స్లామ్ కెరీర్ ముగిసిపోయింది. నా చిన్నారి కుమారుడి సమక్షంలో ఇలా గ్రాండ్‌స్లామ్ ఫైనల్ ఆడతానని అస్సలు ఊహించలేదు. ఇంతకంటే మరో గొప్ప చోటు ఎక్కడా ఉండదు’’ అంటూ సానియా చెప్పుకొచ్చింది.
Maegan Hall: ఉద్యోగం కోల్పోయిన ఆ పోలీస్ ఆఫీసర్‌కి స్ట్రిప్ క్లబ్ బంపరాఫర్
కాగా.. సానియా మీర్జా ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమంగా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే! ఆస్ట్రేలియా ఓపెన్ 2023నే తన చివరి గ్రాండ్‌స్లామ్ అని కూడా అందులో పేర్కొంది. మరో భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్నతో కలిసి ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన సానియా.. ఫైనల్‌లో మాత్రం ఓటమి చవిచూసింది. బ్రెజిల్ జంట లూసియా స్టెఫానీ- రఫేల్ మాటోస్ చేతిలో ఓడిపోయి.. భారత్ జోడీ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. సానియా మీర్జా కెరీర్‌లో ఇది 11వ గ్రాండ్‌స్లామ్. ఇప్పటివరకు ఆమె 43 డబుల్స్ టైటిళ్లు గెలవగా.. అందులో ఆరు గ్రాండ్‌స్లామ్ ట్రోఫీలు ఉన్నాయి. మహిళల డబుల్స్‌లో మూడు, మిక్స్‌డ్ డబుల్స్‌లో మూడుసార్లు విజేతగా నిలిచారు. 2009లో మహేశ్ భూపతితో కలిసి తొలి గ్రాండ్‌స్లామ్ ట్రోఫీ (ఆస్ట్రేలియన్ ఓపెన్)ని కైవసం చేసుకుంది.
Pawan Kalyan: అన్ స్టాపబుల్.. ఫైనల్ గా పవన్ ఎపిసోడ్ వచ్చేది ఎప్పుడంటే.?
అంతేకాదు.. మహిళల డబుల్స్ కేటగిరీలో సానియా 91 వారాల పాటు నంబర్ 1 ర్యాంకులో సానియా మీర్జా కొనసాగింది. కానీ.. కెరీర్‌లో ఒక్కసారి కూడా ఆమె మేజర్ సింగిల్స్ టైటిల్ గెలవలేకపోయింది. ఇది ఆమె కెరీర్‌లో పెద్దలోటుగా మిగిలిపోయింది. ఇప్పుడు తన కుమారుడు ఇజహాన్ ఎదుట ఫైనల్ ఆడి, కన్నీళ్లు పెట్టుకుంటూ టెన్నిస్‌కు వీడ్కోలు పలికింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా ఓపెన్ నిర్వాహకులు.. ‘‘మేము నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం’’ అంటూ ట్వీట్ వేసింది. ఇదిలావుండగా.. వచ్చే నెలలో దుబాయ్ వేదికగా జరుగనున్న డబ్లూటీఏ 1000 ఈవెంట్ తర్వాత సానియా తన టెన్నిస్ కోర్టుకు పూర్తిగా దూరం కానుంది.