IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్‌లో విషాదం.. హైదరాబాద్‌కి చెందిన ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IIT Kharagpur: ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో తీవ్ర విషాదం అలముకుంది. హైదరాబాద్‌కు చెందిన ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పుల్లగురం దీపక్ రెడ్డి (36) తన క్వార్టర్స్‌లో అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపింది. బుధవారం ఉదయం నుంచి సహోద్యోగులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆయన స్పందించకపోవడం, ఎంతసేపటికీ గది తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. మధ్యాహ్నం 12.30 గంటల ప్రాంతంలో హిజ్లీ ఔట్‌పోస్టు పోలీసులు భద్రతా సిబ్బందితో కలిసి తలుపులు తెరిచి చూడగా, దీపక్ రెడ్డి ఉరివేసుకున్న స్థితిలో విగతజీవిగా కనిపించారు. వెంటనే ఆయన్ను క్యాంపస్‌లోని బీసీ రాయ్ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
ఈ ఘోర ఉదంతంపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించేందుకు ఆయన గదిని సీజ్ చేశారు. అయితే అక్కడేమీ సూసైడ్ నోట్ లభించలేదని, పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మరణానికి గల అసలు కారణాలు తెలుస్తాయని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా ఎస్పీ పాపియా సుల్తానా స్పష్టం చేశారు. ఇది ఆత్మహత్యా లేక ఉద్యోగ, వ్యక్తిగత ఒత్తిళ్ల వల్ల జరిగిన ప్రాణనష్టమా అనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. పోలీసులు ఇప్పటికే హైదరాబాద్‌లోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించగా, ఈ విచారకర సంఘటనపై ఐఐటీ ఖరగ్‌పూర్ యాజమాన్యం నుంచి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
Also Read
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
తాజావార్తలు
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
-
Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! ‘పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్’
-
SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!