YS Jagan Srikakulam Tour: శ్రీకాకుళంలో జగన్ పర్యటన పూర్తి షెడ్యూల్.. పోలీసుల కఠిన ఆంక్షలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Srikakulam Tour: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. ప్రస్తుతం అంపోలు జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును ఆయన జైలులో ములాఖత్ ద్వారా పరామర్శించనున్నారు. ఎన్నికల అనంతరం జగన్ శ్రీకాకుళం జిల్లాకు రావడం ఇదే తొలిసారి కావడంతో వైసీపీ శ్రేణులు ఈ పర్యటనకు ప్రాధాన్యం ఇస్తున్నాయి.
అయితే, సీదిరి అప్పలరాజు కుమారుడు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటనలో, కుమారుడిని కేసు నుంచి తప్పించేందుకు ప్రయత్నించారనే ఆరోపణలపై పోలీసులు అప్పలరాజును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆయన శ్రీకాకుళం జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించనున్నారు. అయితే, వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా విశాఖపట్నం నుంచి జాతీయ రహదారి మార్గంలో శ్రీకాకుళం చేరుకోనున్నారు. భోగాపురం, పూసపాటిరేగ, పైడి భీమవరం, రణస్థలం, ఎచ్చెర్ల మీదుగా అంపోలు జిల్లా జైలుకు చేరుకుని మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు అప్పలరాజుతో ములాఖత్ నిర్వహించనున్నారు.
Also Read
- Heavy Rain Alert: వాయుగుండం ఎఫెక్ట్.. అంధకారంలో శ్రీకాకుళం
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Chintada Ravi Kumar Arrest: పోలీసుల అదుపులో వైసీపీ నేత చింతాడ రవికుమార్.. సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు
- YS Jagan Srikakulam Visit: వైఎస్ జగన్ శ్రీకాకుళం పర్యటనపై ఉత్కంఠ.. పోలీసుల ఆంక్షలు.. ర్యాలీలు, సభలకు నో పర్మిషన్..
అయితే, వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో ఆంక్షలు విధించారు పోలీసులు.. జైలు వద్ద ములాఖత్‌కు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ర్యాలీలు, భారీ జనసమీకరణకు అనుమతి లేదని శ్రీకాకుళం పోలీసులు స్పష్టం చేశారు. గతంలో క్రౌడ్ గ్యాదరింగ్ల సమయంలో చోటుచేసుకున్న ఘటనలు, ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన, శాంతిభద్రతల అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు..
వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్
* ఉదయం 9:00 గంటలకు – తాడేపల్లి నుంచి గన్నవరం విమానాశ్రయానికి బయలుదేరు
* 9:30 గంటలకు – గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు
* 9:45 గంటలకు – విమానంలో విశాఖపట్నంకు బయలుదేరుతారు
* 10:45 గంటలకు – విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 11:00 గంటలకు – రోడ్డు మార్గంలో శ్రీకాకుళం జిల్లాకు ప్రయాణం ప్రారంభం
* మార్గం: భోగాపురం → పూసపాటిరేగ → పైడి భీమవరం → రణస్థలం → ఎచ్చెర్ల
* మధ్యాహ్నం 2:00 గంటలకు – అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు
* 2:00–3:00 గంటల వరకు – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుతో జైలులో ములాఖత్
* 3:00 గంటలకు – జైలు నుంచి విశాఖపట్నంకు బయలుదేరుతారు
* సాయంత్రం 5:30 గంటలకు – విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు
* 5:50 గంటలకు – తిరుగు ప్రయాణం అవుతారు..
తాజావార్తలు
-
Srinidhi Shetty : ఆదర్శ కుటుంబం శ్రీనిధి శెట్టికి ఆఫర్స్ తెచ్చిపెడతాయా..?
-
Varanasi Release Date: ఏప్రిల్ 7న ‘వారణాసి’ వస్తుందా?.. ఎన్టీఆర్ ప్రశ్నకు రాజమౌళి సమాధానం ఇదే!
-
Honda Shine Sales: షైన్ బైక్‌కు జనం ఫిదా.. ఒకే నెలలో 1.80 లక్షలకుపైగా అమ్మకాలు
-
Election Commission: వివాదం వేళ ఎన్నికల సంఘం సంచలన నిర్ణయం.. ఇక, Form-6తో ఇక Annexure-D అవసరం లేదు!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
ట్రెండింగ్
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?