Kodali Nani: చంద్రబాబు, రజనీకాంత్‌లకు భవిష్యత్తు లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kodali Nani Again Fires On Chandrababu Naidu Rajinikanth: ఏపీ మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని మరోసారి టీడీపీ అధినేత చంద్రబాబు, సూపర్‌స్టార్ రజినీకాంత్‌లపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఇద్దరికీ భవిష్యత్ లేదని పేర్కొన్నారు. మంగళవారం చంద్రబాబు హైదరాబాద్ ఆసుపత్రిలో ఉంటే.. రజినీకాంత్ చెన్నై హాస్పిటల్‌లో ఉంటాడని అన్నారు. వారిద్దరికీ ఆసుపత్రుల చుట్టూ తిరగడంతోనే సరిపోతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఒక ఎకరం ల్యాండు కొనుగోలు చేసి.. మంచి నీటి అవసరాలు తీర్చాడని చెప్తే, తాను వెళ్లిపోతానని సవాల్ విసిరారు. చంద్రబాబుకి, సీఎం జగన్‌కి.. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని విమర్శించారు. 2300 మంది ఆర్టీసీ కుటుంబాలను చంద్రబాబు గాలికొదిలేసాడని ఆరోపణలు చేశారు. గుడివాడ ఆర్టీసీ డిపో ప్రారంభోత్సవంలో ఆయన పై విధంగా నిప్పులు చెరిగారు.
Perni Nani: ఈసారి కూడా గుడివాడలో కొడాలి నానిదే విజయం.. పేర్ని నాని జోస్యం
Also Read
- Nara Lokesh: నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్.. ఫార్మా దిగ్గజాలకు మంత్రి లోకేష్ ఆహ్వానం..
- AP Govt: బిగ్ అలర్ట్.. అక్టోబర్ నెల ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో మార్పు..
- AP Excise Policy 2026-27: కొత్త ఎక్సైజ్ పాలసీకి రంగం సిద్ధం.. 807 మద్యం దుకాణాలకు లాటరీ!
- Heavy Rains: బీభత్సం సృష్టిస్తున్న భారీ వర్షాలు.. నీట మునిగిన వందల ఎకరాల వరి పంట!
అనంతరం కొడాలి నాని మాట్లాడుతూ.. తనది కూడా మోటారు ఫీల్డ్ అని, ముఫ్ఫై బస్సులు తనవి తిరిగేవని చెప్పారు. గుడివాడ ఆర్టీసీ బస్టాండు గురించి తనకు మంచి అవగాహన ఉందన్నారు. పులివెందుల తరువాత రూ.20 కోట్లతో నిర్మాణం చేస్తున్నది గుడివాడ బస్టాండేనని తెలిపారు. చంద్రబాబు, లోకేష్ ఎందుకు కట్టలేదని ప్రశ్నిస్తే.. వాళ్లు ఏం మాట్లాడరని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ ప్రజల దాహార్తి తీర్చిన మహానుభావుడు రాజశేఖరరెడ్డి అని.. ఫ్లైఓవర్ కట్టిన మహానుభావుడు ఎన్టీఆర్ అని చెప్పుకొచ్చారు. చంద్రబాబు 14 సంవత్సరాలు అధికారంలో ఉండి కూడా ఏం చేయలేదని ఫైర్ అయ్యారు. గుడివాడలో చక్రాలు, బొంగరాలు 14 ఏళ్ళు తిప్పిన చంద్రబాబు.. ఏం చేయలేకపోయాడని ఎద్దేవా చేశారు. అయినా మొన్న సిగ్గులేకుండా చంద్రబాబు మాట్లాడాడని ధ్వజమెత్తారు. రాజశేఖరరెడ్డి ఇచ్చిన స్థలంలోనే టిడ్కో ఇళ్ళు కట్టించామని కొడాలి నాని అన్నారు. ఎవడో వచ్చాడు.. ఏదో చేస్తాడు.. అనేది ఎప్పుడూ జరుగుతూనే ఉంటున్నారు. ఎవడూ ఏకగ్రీవంగా గెలవడన్న కొడాలి నాని.. మంత్రిగా చేసినా, ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తన పేరు చరిత్రలో నిలిచిపోతుందని ఉద్ఘాటించారు.
Lightning Strike: మొబైల్ ఫోన్ మాట్లాడుతుండగా పిడుగుపాటు.. రైతు మృతి
కాగా.. అంతకుముందు ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల్లో సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలపై కొడాలి నాని నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే! రజనీకాంత్ సిగ్గు శరం లేకుండా చంద్రబాబును పొగుడుతున్నారని, పవన్ కళ్యాణ్‌ను బ్లాక్ మెయిల్ చేసేందుకే రజనీని చంద్రబాబు రంగంలోకి దింపారని ఆరోపించారు. ఇప్పటికైనా చంద్రబాబు రాజకీయాలను పవన్ కల్యాణ్ తెలుసుకోవాలని హితవు పలికారు. ఎన్టీఆర్‌పై చెప్పులు విసురుతున్న సమయంలో.. వైస్రాయ్ హోటల్‌లో చంద్రబాబుకు రజనీ మద్దతు తెలిపారన్నారు. మూడు రోజులు షూటింగ్‌లో పాల్గొని, నాలుగు రోజులు హాస్పిటల్లో ఉండే రజనీకాంత్ తెలుగు ప్రజలకేం చెప్తారని ప్రశ్నించారు. ఎవడో రాసిచ్చిన స్క్రిప్ట్‌ను చదువుతూ రజనీకాంత్ మరింత దిగజారుతున్నారని, ఏపీ రాజకీయాలపై అవగాహన లేకుండా మాట్లాడారని అన్నారు.
తాజావార్తలు
-
Chiranjeevi : నానమ్మ, తాతయ్యల జీన్స్ వచ్చాయి.. జాసన్ సంజయ్‌పై చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Chiranjeevi : ఫరియా,.. నన్ను తొక్కేయాలని చూస్తున్నావా?
-
ADR Report: 4 ఏళ్లలో పార్టీలు మారిన 111 మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు.. ఎక్కువ మంది చేరిన పార్టీ ఏదంటే..
-
PM Modi: భజన క్లబ్బింగ్‌లో మోడీ.. యువతతో కలిసి భక్తి పాటలకు కంజర వాయించిన ప్రధాని
-
OTR: టీడీపీ-వైసీపీ ‘జెంటిల్మెన్ అగ్రిమెంట్’?రామేశ్వరం మెట్టపై హాట్ డిస్కషన్..
ట్రెండింగ్
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?
-
Beerakaya Pachadi: వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని తింటే అమృతమే.. నోరూరించే “బీరకాయ రోటి పచ్చడి” చేసేయండిలా..!
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!