Samantha New Show: సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌కు సమంత హోస్ట్.. టీవీతో పాటు ఓటీటీలోనూ సందడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Samantha New Show: సమంత రూత్ ప్రభు మరోసారి కొత్త అవతారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సినిమాలు, వెబ్ సిరీస్‌లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించిన ఆమె, ఇప్పుడు తొలిసారిగా ఒక భారీ కుకింగ్ రియాలిటీ షోకు వ్యాఖ్యాతగా బాధ్యతలు చేపట్టింది. ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైన మాస్టర్‌చెఫ్ ఫార్మాట్‌కు తమిళ వెర్షన్‌గా వస్తున్న సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్ కార్యక్రమాన్ని సమంత హోస్ట్ చేయనుండటం అభిమానుల్లో ఆసక్తిని మరింత పెంచుతోంది. ఈ షోను ప్రముఖ నిర్మాణ సంస్థ బనిజయ్ ఆసియా రూపొందిస్తోంది. ఇందులో తమిళ సినీ, టెలివిజన్ రంగాలకు చెందిన ప్రముఖులు పోటీదారులుగా పాల్గొంటారు. వంటకాలు మాత్రమే కాకుండా, సెలబ్రిటీల వ్యక్తిత్వం, సరదా కబుర్లు, పోటీ స్ఫూర్తి కూడా ఈ కార్యక్రమంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి.
ఇటీవల విడుదలైన ఆఫీషియల్ ప్రోమోలో సమంత ఈ షోకు హోస్ట్‌గా కనిపించింది. అదే సమయంలో ఈ కొత్త ప్రయాణంపై ఆమె తన ఆనందాన్ని కూడా పంచుకుంది. ఇప్పటివరకు తాను చేసిన ప్రాజెక్టుల కంటే ఇది పూర్తిగా భిన్నమని, అందుకే ఈ అవకాశాన్ని వెంటనే అంగీకరించానని తెలిపింది. ఆహారం అనేది కేవలం వంటకం మాత్రమే కాదని, అది మనుషులను దగ్గర చేసే ఒక మధుర జ్ఞాపకమని సమంత చెప్పడం విశేషం. ముఖ్యంగా అభిమానులకు కనిపించని సెలబ్రిటీల మరో కోణాన్ని ఈ షో బయటపెడుతుందని ఆమె పేర్కొంది. వంటగదిలో వారు చేసే ప్రయోగాలు, తప్పులు, నవ్వులు, పోటీ ఉత్సాహం ప్రేక్షకులను అలరిస్తాయని చెప్పింది. పోటీదారుల పేర్లు ఇప్పుడే చెప్పలేనని, అదే ఈ షోలోని అసలు సర్ప్రైజ్ అని కూడా సరదాగా వ్యాఖ్యానించింది.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
ఈ కార్యక్రమం సోనీ విజా టీవీలో ప్రసారం కానుండగా, అదే సమయంలో సోనీలివ్ ఓటీటీ వేదికలో కూడా స్ట్రీమింగ్ కానుంది. దీంతో టెలివిజన్ ప్రేక్షకులతో పాటు డిజిటల్ ఆడియన్స్‌ను కూడా ఒకేసారి చేరుకునేలా మేకర్స్ ప్రణాళిక రూపొందించారు. అయితే ప్రీమియర్ తేదీని మాత్రం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఇటీవల సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కుటుంబ నేపథ్యంలో యాక్షన్, ఎమోషన్స్ థీమ్స్ తో తెరకెక్కిన ఆ చిత్రంలో ఆమె నటనకు మంచి స్పందన లభించింది. ఇప్పుడు హోస్ట్‌గా కూడా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడంతో ఆమె కెరీర్లో మరో ఆసక్తికరమైన అధ్యాయం మొదలవుతోంది.
సినిమాల్లోనే కాకుండా రియాలిటీ షోల ద్వారా కూడా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన సమంత, సెలబ్రిటీ మాస్టర్‌చెఫ్ తమిళ్‌తో తనకు ఉన్న ఫేమ్, చురుకుదనంతో వేదిక కనుల విందు చేయనుంది అని చెప్పడంలో సందేహం అయితే లేదు. హోస్ట్ గా విడుదలైన ప్రోమోకు ఇప్పటికే మంచి స్పందన రావడంతో, షో ప్రారంభం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!